పొలిటికల్ కరెప్షన్ ఓకే... వారి అవినీతే తగ్గాలి...: మంత్రులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Nov 13, 2019, 5:19 PM IST

అమరావతి వేదికన జరిగిన ఏపి కేబినెట్ కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులతో పలు కీలక అంశాలపై మరోసారి భేటీ అయ్యారు. 


అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ కార్పోరేషన్ ఏర్పాటుపై మంత్రులతో  సీఎం జగన్ చర్చించారు. క్యాబినేట్ అనంతరం కొద్ది సేపు మంత్రులతో భేటీ అయిన జగన్ దీనిపైనే ప్రదానంగా చర్చించినట్లు సమాచారం. 

ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించొద్దని మంత్రులు సీఎంకు సూచించారు. సుదీర్ఘ కాలం నుంచి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సర్వీసుల్లో ఉన్న వారిని కదిలించిందన్న మంత్రులు కోరినట్లు సమాచారం. సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూనే.. 50 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్ణయించారు.

Latest Videos

ప్రభుత్వంపై అవినీతి ముద్ర ఎంత మాత్రం పడడానికి వీల్లేదని...ఆ విధంగా కార్పోరేషన్ విధివిదానాలు రూపొందించాలని సూచించారు.  రాష్ట్రంలో పొలిటికల్ కరెప్షన్ దాదాపు కంట్రోల్ అయిందని  జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలా పొలిటికల్ కరెప్షన్ తగ్గినా... అధికారుల స్థాయిలో మాత్రం అవినీతి ఎంతమాత్రం తగ్గలేదని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

read more స్టార్ట్-అప్ ఏరియా ప్రాజెక్ట్ సాధ్యం కాదు..:తేల్చేసిన ఆర్థిక మంత్రి

బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో కూడా పలు కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. ఇసుక నిల్వ చేసినా అక్రమంగా రవాణా చేసినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా, పునర్విక్రయం చేసినా కఠినచర్యలు తీసుకునేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఓ  తీర్మానం చేసింది.   

ఇసుక అక్రమ రవాణా చేస్తూ దొరికితే కనీసం జరిమానా రూ.2 లక్షల రూపాయలతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్ట సవరణకు ఆమోదముద్ర వేసింది. మంత్రి వర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఇసుక డిమాండ్ భారీగా ఉన్న నేపథ్యంలో ఒక వారం పాటు ప్రభుత్వంలోని కొన్ని యంత్రాంగాలను రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖ రీచ్‌ల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించినట్లుగా నాని తెలిపారు. 

read more  వదిలే ప్రసక్తే లేదు... నారా లోకేశ్ పై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు: వైసిపి ఎమ్మెల్యే

ప్రతి రోజు లక్షా యాభైవేల నుంచి రెండు లక్షల టన్నుల వరకు ఇసుక లభ్యత ఉండేలా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో ఉన్న 9 వేల పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని నాని పేర్కొన్నారు. 9 వేల పరిశ్రమల్లో 2 వేల పరిశ్రమలను రెడ్ కేటగిరి పరిశ్రమలుగా వర్గీకరించామన్నారు. రాష్ట్రంలో పర్యావరణ వ్యర్ధాల విషయంలో ఆడిట్ లేదని నాని పేర్కొన్నారు.


 

click me!