ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ, శాసన మండలిలకు సంబంధించి వివిధ కమిటీలను నియామకం జరిగింది. ఈ కమిటీల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులకు చోటు దక్కింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ, శాసన మండలి లో పలు కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన కమిటీలను నియమిస్తూ అధికారులు బులిటిన్ విడుదల చేశారు. ఏపి శాసన సభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఉభయ సభల సభ్యులతో పలు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
శాసనసభ వసతులు, సౌకర్యాల కమిటీ ఛైర్మన్, అటవీ, పర్యావరణ సంరక్షణ కమిటీ ఛైర్మన్ గా స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహరించనున్నారు. ఎస్సీ సంక్షేమం కమిటీ ఛైర్మన్ గా గొల్ల బాబురావు నియామితులయ్యారు. ఎస్టీ సంక్షేమం కమిటీ ఛైర్మన్ గా తెల్లం బాలరాజును ఎంపికచేశారు.
మైనార్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ గా షేక్ మహ్మద్ ముస్తఫా, స్త్రీ శిశు సంక్షేమ, దివ్యాంగులు, వృద్దుల సంక్షేమ కమిటీ ఛైర్మన్ గా విశ్వసరాయి కళావతి, బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తిని నియమించారు. లైబ్రరీ కమిటీ ఛైర్మన్ గా అంగర రామ్మోహన్, సబార్డినేట్ లెజిస్ట్లేషన్ కమిటీ ఛైర్మన్ గా శమంతకమణిని నియమించారు.
READ MORE అనంత వెంకట రామిరెడ్డికి కీలక బాధ్యతలు...
ఇక శాసన మండలి సభ్యులతో కూడా పలు కమిటీలు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏడుగురు సభ్యులతో తెలుగు ,సంస్కృతి అభివృద్ధి కోసం ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ ఛైర్మన్ గా శాసన మండలి ఛైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్ ను వ్యవహరించనున్నారు.
అలాగే ఐదుగురు సభ్యులతో ఎథిక్స్ కమిటీని నియమించారు. ఈ ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డిని నియమించారు. ఐదుగురు సభ్యుల తో పిటిషన్స్ కమిటీని కూడా ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ఛైర్మన్ గా రెడ్డి సుబ్రమణ్యం నియమితులయ్యారు.
READ MORE ప్రతి పైసాకు లెక్కలోకి...నిబద్దతతో పనిచేసే బాధ్యత మనదే...: పయ్యావుల కేశవ్
పేపర్స్ లెయిడ్ ఆన్ టేబుల్ కమీటీ ఛైర్మన్ గా వైవిబీ రాజేంద్ర ప్రసాద్, సభా హక్కుల కమిటీ ఛైర్మన్ గా దేవసాని చిన్న గోవింద రెడ్డి నియమితులయ్యారు. సభా హక్కుల కమిటీలో ఆరుగులు సభ్యుల ఎంపిక కూడా జరిగింది. ఐదుగురు సభ్యులతో ప్రభుత్వ హామీల కమిటీ ఏర్పాటుచేశారు. ఈ హామీల కమిటీ ఛైర్మన్ గా జి. తిప్పే స్వామిని నియమించారు.