రాజధాని గ్రామమైన ఎర్రబాలెంలో విషాదం చోటుచేసుకుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన ఓ రైతు మృతి కేవలం ఎర్రబాలెంలోనే కాదు మొత్తం అమరావతి గ్రామాల్లో విషాదాన్ని నింపింది.
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ సాగుతున్న ఉద్యమంలో మరో విషాదం చోటుచేసుకుంది. అమరావతి నిర్మాణం కోసం తన భూమిని కోల్పోయిన ఓ రైతు రాజధాని తరలింపు నిర్ణయంతో తీవ్ర ఆవేధనకు గురయ్యాడని... ఈ క్రమంలోనే శుక్రవారం గుండెపోటుకు గురయి చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
గుంటూరు జిల్లాలోని ఎర్రబాలెం గ్రామ రైతుల నుండి గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూములను సేకరించింది. ఈ క్రమంలో చింతా చంద్రశేఖర్(65) అనే సన్నకారు రైతు తన 1.20ఎకరాల భూమిని కోల్పోయాడు. అతడి భూమిని టిడిపి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వాదీనం చేసుకుంది.
undefined
read more చంద్రబాబు అక్రమాస్తుల పిటిషన్ పై ఏసిబి కోర్ట్ విచారణ... హాజరైన లక్ష్మీపార్వతి
అయితే భూమి పోయినా తమ ప్రాంతం అభివృద్ది చెందుతుందని భావించినా వైసిపి ప్రభుత్వ నిర్ణయం అతడి ఆశలపై నీళ్ళు చల్లింది. రాజధానిని అమరావతి నుండి తరలిస్తే తమ భూముల ధరలు తగ్గడమే కాదు పిల్లల భవిష్యత్ కూడా నాశనమవుతుందని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం మరింత ఒత్తిడికి లోనవడంతో గుండెపోటు వచ్చింది.
దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అతడి కుటుంబంలోనే కాదు రాజధాని గ్రామాల్లో కూడా విషాదం చోటుచేసుకుంది.