అమరావతి ఉద్యమంలో మరో విషాదం... రాజధాని కోసం ఆగిన మరో గుండె

By Arun Kumar P  |  First Published Jan 18, 2020, 7:46 PM IST

రాజధాని కోసం అమరావతి కొనసాగుతున్న నిరసనల్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామస్తులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహిళ గుండెపోటుతో మృతిచెందింది. 


అమరావతి: రాజధానిని తమ ప్రాంతంలోనే కొనసాగించాలంటూ సాగుతున్న అమరావతి ఉద్యమంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఎక్కడ రాజధాని తమ ప్రాంతం నుండి తరలి వెళ్లిపోతుందోనని తీవ్ర మనోవేదనకు గురయి ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందింది. దీంతో రాజధాని కోసం ప్రాణాలు కోల్పోయిన వారి  సంఖ్య 19కి చేరింది. 

గుంటూరు జిల్లా తుళ్లూరుకి చెందిన పువ్వాడ వెంకాయమ్మ(67) ముప్పై రెండురోజులనుండి అమరావతి నిరసనల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో ఇవాళ కూడా వెంకాయమ్మ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు.

Latest Videos

undefined

దీంతో రాజధాని ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే రాజధాని కోసం అమరావతికి చెందిన పలువురు ఆత్మహత్యలు, గుండెపోటుకు గురయి మృతిచెందారు. ఇలా మరో మహిళ కూడా తీవ్ర ఆందోళనకు లోనయి మృతిచెందడంతో మృతుల సంఖ్య 19కి చేరింది. 

read also  అమరావతి ఉద్యమంలో మరో విషాదం... తుళ్లూరులో మహిళా రైతు మృతి

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ సాగుతున్న నిరసనల్లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం వెలగపూడికి చెందిన గోపాలరావు అనే వృద్దుడు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న తన మనవడిని పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్త విని తట్టుకోలేక గుండెపోటుకు గురయి మృతిచెందాడు.  

రాజధాని తరలింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న క్రమంలో మందడంలో ఓ రైతు స్పహ తప్పిపడిపోయాడు. ఇలా అనారోగ్యంపాలయిన రైతు సాయంత్రం మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. 

read more  ఆ వెధవ పని చేసింది చంద్రబాబే... రాజధానిపై ఉద్యోగ సంఘం నేత కీలక వ్యాఖ్యలు

తాళ్లాయపాలెంకు చెందిన కొండేపాటి సుబ్బయ్య అనే రైతు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా నిరసన దీక్షలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల నుంచి ఏమి తినకపోవడంతో ఆదివారం ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తోటి రైతులు ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు.

 

 

click me!