దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమాలో ట్విస్ట్ ఎంత పెద్ద హిట్ అయ్యిందనే సంగతి తెలిసిందే. ఆ సినిమో ఒక ట్విస్ట్ ఊహించని విధంగా ఉండటంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమా మూడ్ ను మొత్తం ఒక్కసారిగా చేంజ్ చేసే ఆ ట్విస్ట్ బాగా కలిసి వచ్చింది.
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'అల్లూరి' సినిమా వస్తోంది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలో దిగిపోనుంది. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ చిత్రంపై శ్రీవిష్ణు చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే ఆ నమ్మకానికి కారణం ఈ చిత్రం చివర్లో వచ్చే షాకింగ్ ట్విస్ట్ అంటున్నారు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటి
మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రంలో వచ్చే ట్విస్ట్... టెర్రరిస్థులకు దొరికిన హీరోని ఉప్పెన తరహాలో హింసించి,గాయపరిచే ఎపిసోడ్ ఒకటి ఇందులో ఉందని తెలుస్తోంది. సెన్సార్ వారు సగానికి పైగా తగ్గించమని చెప్పారట. ఇది హై ఇంటెన్సిటీ ఉన్న వయొలెంట్ ఎపిసోడ్ అని చెప్తున్నారు. సెన్సార్ సూచన మేరకు ...యూనిట్ ఏడు నిమిషాల దాకా కోత పెట్టిందట. ఈ ట్విస్ట్ పేలిందంటే సినిమా సూపర్ హిట్ అని చెప్తున్నారు. దాన్ని నమ్మే శ్రీ విష్ణు చేసారంటున్నారు.
శ్రీవిష్ణు మాట్లాడుతూ .. "ఈ సినిమాకి ముందు చేసిన రెండు సినిమాల్లోను దొంగ పాత్రనే చేశాను. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేయడం కొత్తగా అనిపించింది. పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథలు గతంలో చాలానే వచ్చాయి. కానీ ఈ సినిమా ఒక పోలీస్ ఆఫీసర్ బయోపిక్. ఈ కథ వినగానే నేను ఈ సినిమాను ఒప్పుకోవడానికి కారణం ఇదే. కొత్తదనమున్న కథలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమాలోని ఈ పాత్ర కోసం నేను బరువు తగ్గడం .. పెరగడం చేశాను. ఆడియన్స్ పెట్టే డబ్బుకి రెట్టింపు వినోదాన్ని ఈ సినిమా ఇస్తుందని నేను నమ్మకంగా చెప్పగలను" అంటూ సమాధానమిచ్చాడు.
'బ్రోచేవారెవరురా' తరువాత శ్రీ విష్ణు ఇక దూకుడు చూపిస్తాడని అనుకుంటే, 'తిప్పరా మీసం' .. 'గాలి సంపత్' సినిమాలు పరాజయాలను అందుకున్నాయి. ఆ తరువాత 'రాజ రాజ చోర' ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ,' 'అర్జున ఫల్గుణ' దెబ్బకొట్టేసింది. ఆ తర్వాత 'భళా తందనాన' సైతం అదే దారిలో ప్రయాణించింది.