దసరా సందర్భంగా అక్టోబర్ 3న ఆదిపురుష్ టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చిత్రబృందం టీజర్ ను కట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్ తర్వాత సినిమా ప్రమోషన్ పనులు మొదలు పెడతారని టాక్.
‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్ (Prabhas). ఈ సినిమా ఇచ్చిన ఇచ్చిన ఉత్సాహంతో ఆయన నటిస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియాగా రూపొందుతున్నాయి. ‘బాహుబలి’తర్వాత వచ్చిన ‘సాహో’యావరేజ్ అనిపించుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘రాధే శ్యాం’మాత్రం డిజాస్టర్ అయ్యింది. దాదాపు ఈ రెండు చిత్రాలు థియేటర్స్‌లోకి వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు.
ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఓం రౌత్ దర్శత్వం వహిస్తున్నాడు. కృతి సనన్, సైఫ్‌అలీ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తి అయింది. ప్రస్తుతం పొస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యప్తంగా విడుదల కానుంది. ‘ఆదిపురుష్’ కు సంబంధించిన ఓ వార్త నేషనల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తుంది. అదేమిటంటే...ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజ్ గురించి.
ఈ చిత్రం టీజర్ ని దసరాకు రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ టీజర్ ని రామ జన్మభూమి అయిన అయోధ్యలో విడుదల చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వినికిడి. అయితే ఈ టీజర్ రిలీజ్ కు ప్రభాస్ వెళ్తాడా లేదా అనే క్లారిటి మాత్రం రాలేదు.
మరో ప్రక్క తెలుగు రైట్స్ ని యువి క్రియేషన్స్ వారు సొంతం చేసుకున్నారు. యువి క్రియేషన్స్ అంటే ప్రభాస్ స్వంత సంస్ద. తన రెమ్యునరేషన్ భాగంగా దాదాపు వంద కోట్లు విలువ చేసే రైట్స్ ని ప్రభాస్ సొంతం చేసుకున్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క భారతీయ సినిమా చరిత్రలోనే ‘ఆదిపురుష్’ డిజిటల్ రైట్స్ అత్యధిక ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. ఈ మూవీకీ సంబంధించిన అన్ని భాషల డిజిటల్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఓటీటీ ప్లాట్‌ఫాం రూ. 250కోట్లకు ఈ హక్కులను కొనుగోలు చేసిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తలు కనుక నిజమైతే సినిమాకు పెట్టిన సగం బడ్జెట్ ఓటీటీ రైట్స్ రూపంలోనే వచ్చినట్టవుతుంది. ఈ సినిమాలో జానకీగా కృతి సనన్, రావణాసురుడిగా సైప్‌అలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. రూ. 500కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.