టీవీ ఛానెల్ పై తమన్నా లీగల్ యాక్షన్ ?

Surya Prakash   | Asianet News
Published : Oct 24, 2021, 08:02 AM IST
టీవీ ఛానెల్ పై తమన్నా లీగల్ యాక్షన్ ?

సారాంశం

 తన టీమ్ ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేసి, సమాధానం చెప్పటం లేదని తమన్నాకు కోపం వచ్చిందట. దాంతో తమన్నా లీగల్ యాక్షన్ కు సిద్ధమైందని అంటున్నారు. తన లాయర్ చేత జెమినీ టివి,మరియు నిర్మాతలపై కేసు ఫైల్ చేయిస్తోందని వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటన రావాల్సిందే

ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న  తమన్నా(Tamannah) ఇప్పటికీ తన అందంలో కానీ అబినయంలో కానీ తోటి వారికి పోటీ ఇస్తూనే వస్తోంది. బాహుబలి తర్వాత ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటున్న మిల్కీ బ్యూటీ …వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఇక రీసెంట్ గా ఆమె ఓ టీవీ షోకి హోస్ట్‌గా వ్యవహరించింది.

జెమినీ టీవీలో  ప్రసారం అయిన మాస్టర్ చెఫ్ ఇండియా(Master chef India)కు హోస్ట్‌గా వ్యవహరించింది.  తెలుగు వంట‌ల‌ని ప్ర‌పంచం అంతా గుర్తించేలా ఈ షోని రూపొందించారు. అయితే ఈ షో నుంచి తమన్నా బయిటకు వచ్చేసారు. ఆమెకు అందాల్సిన పేమెంట్ అందకే బయిటకు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఈ షో ను ఇప్పుడు అనసూయ(Anasuya) లీడ్ చేస్తున్నారు. 

ఇక మొదట్లో  డీసెంట్ రేటింగ్స్ సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత కన్సిస్టెన్సీ మైంటైన్ చేయడంలో విఫలమైందని అందుకే ఆమెను వద్దనుకున్నారని మరో ప్రక్క మీడియా అంటోంది. కారణం ఏమైనా Tamannah స్థానాన్ని Anasuya భర్తీ చేసిందనేది నిజం. తమన్నా షో నుండి వెళ్ళిపోయాక జెమినీ టివి వారు ఆమెతో కమ్యూనికేషన్ లో లేరట. అయితే ఆమెకు రెమ్యునేషన్ ఎగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాలని బాకీ మొత్తం పెండింగ్ ఉందని, ఇంకా రాలేదని వినిపిస్తోంది.

 తన టీమ్ ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేసి, సమాధానం చెప్పటం లేదని తమన్నాకు కోపం వచ్చిందట. దాంతో తమన్నా లీగల్ యాక్షన్ కు సిద్ధమైందని అంటున్నారు. తన లాయర్ చేత జెమినీ టివి,మరియు నిర్మాతలపై కేసు ఫైల్ చేయిస్తోందని వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటన రావాల్సిందే. 

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ పరంగా నాలుగో స్థానంలో కొనసాగుతోన్న జెమినీ టివి, మాస్టర్ చెఫ్, ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోస్ ను ప్రారంభించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. మాస్టర్ చెఫ్ కు అనసూయ హోస్ట్ కాగా ఎవరు మీలో కోటీశ్వరులుకి ఎన్టీఆర్ హోస్ట్.  ఇక తమన్నా విషయానికి వస్తే  తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్‌’ చిత్రంలో నటించిన ఆమె ఎఫ్ 3లో వెంకీకి జోడిగా న‌టిస్తోంది. 

also read: నివేదా థామస్‌ సాహసం.. కిలిమంజారో అధిరోహణ

also read: అనసూయ క్రేజ్‌ ముందు తేలిపోయిన స్టార్‌ హీరోయిన్‌.. బ్లాక్‌ సూట్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న హాట్‌ యాంకర్‌

PREV
Read more Articles on
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?