ఈ సినిమా టైటిల్ సాంగ్,టీజర్‌కు భారీ క్రేజ్ రాగా, ఇక నిత్యమీనన్ 'అంత ఇష్టం ఏందయ్యా' అంటూ సాగే సెకండ్ సాంగ్ ఫ్యాన్స్‌కు విపరితంగా నచ్చేసింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశి. పవన్ జోడీగా నిత్యా, రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనున్నారు.
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చే ఏడు సంక్రాంతికి రానున్న 'భీమ్లా నాయక్' సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోంది. పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో రానా మరో అదిరిపోయే పాత్రను చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ సాంగ్,టీజర్‌కు భారీ క్రేజ్ రాగా, ఇక నిత్యమీనన్ 'అంత ఇష్టం ఏందయ్యా' అంటూ సాగే సెకండ్ సాంగ్ ఫ్యాన్స్‌కు విపరితంగా నచ్చేసింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశి. పవన్ జోడీగా నిత్యా, రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ వైరలవుతోంది.
అదేమిటంటే...రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ నుంచి భీమ్లా నాయక్ కు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కోసం 150 కోట్ల ఆఫర్ వచ్చింది.కొద్ది రోజుల క్రితం పవన్ కు ఏపి ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా థియేటర్లలో కాకుండా పవన్ మూవీ డిజిటల్ లో వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అబ్బే అలాంటిదేమీ లేదు అన్నారు. కానీ ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఓ సినిమాకు నూటా యాభై కోట్లు పెట్టి కొనుక్కోవటం అంటే మాటలు కాదు. ఇది చాలా భారీ మొత్తం.
also read: లైగర్ బ్యూటీ అనన్య పాండే గురించి ఐదు మైండ్ బ్లోయింగ్ డిటైల్స్...!
వార్త నిజమే అయితేనే బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఓటీటినే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే థియేటర్ల ద్వారా ఇంత మొత్తం షేర్ రూపంలో రావాలంటే భీమ్లా నాయక్ సుమారు 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. సినిమా ఎంత బాగున్నా ఇది చాలా కష్టమైన ఫీట్. అయితే అందుతున్న సమాచారం మేరకు సినిమాని థియోటర్ లోనే రిలీజ్ చేస్తారు. నిర్మాత నాగవంశీ కూడా ట్వీట్ చేస్తూ భీమ్లా నాయక్ థియేటర్లలోనే వస్తుందని క్లారిటీ ఇచ్చారు. భీమ్లా నాయక్ ముందు ప్రకటించిన జనవరి 12కి వస్తుంది.అయితే ఈ సినిమాకు రాధే శ్యామ్, సర్కారు వారి పాట స్ట్రెయిట్ సినిమాలతో భారీ పోటీ ఉంది.
also read: HBD Prabhas: ప్రభాస్ జాతకం తిరగేస్తున్న జ్యోతిష్యులు.. ఎంజీఆర్, రజనీకాంత్ లాగే.. పెళ్లిపై అంచనా