మారుతికి త్రివిక్రమ్ దెబ్బ,బెటర్ లక్ నెక్ట్స్ టైమ్?

Published : Dec 15, 2018, 04:32 PM IST
మారుతికి త్రివిక్రమ్ దెబ్బ,బెటర్ లక్ నెక్ట్స్ టైమ్?

సారాంశం

డైరక్టర్ మారుతి చిన్న సినిమాలనుంచి ఒక్కో మెట్టే ఎదుగుతూ స్టార్ హీరోలను డైరక్ట్ చేసే స్దాయికు చేరుకున్నారు. 

డైరక్టర్ మారుతి చిన్న సినిమాలనుంచి ఒక్కో మెట్టే ఎదుగుతూ స్టార్ హీరోలను డైరక్ట్ చేసే స్దాయికు చేరుకున్నారు. అయితే ఆయనకు  ఎంత టాలెంట్ ఉన్నా చిన్న హీరోలతో చేయటం,అవీ కామెడీ సినిమాలు కావటంతో పెద్ద హీరోలెవరూ దగ్గరకు రానివ్వటం లేదు. దాంతో ఇది కాదు పద్దతి అని తను మొదటి నుంచి నమ్ముకున్న మెగా క్యాంప్ తోనే ముందుకు వెళ్లాలకున్నాడు. అల్లు అర్జున్ ని పట్టుకుని సినిమా లాగేసి, స్టార్ హీరోల డైరక్టర్స్ లిస్ట్ లో చేరుదామనుకున్నాడు. కానీ మారుతి టైమ్ బాగున్నట్లు లేదు. త్రివిక్రమ్ అడ్డుపడిపోయాడని సమాచారం.

త్రివిక్రమ్ అనుకున్న సినిమా లేట్ అయ్యేటట్లు ఉందని భావించిన అల్లు అర్జున్ ..ఆ గ్యాప్ లో మారుతితో సినిమా చేద్దామని అన్నారట. దాంతో మారుతి ఆఘమేఘాల మీద ఓ కథని వండేసి..అల్లు అర్జున్ చేత ఓకే చెప్పించుకునే పనిలో పడ్డారు. అయితే ఊహించని విధంగా అంతకన్నా స్పీడుగా త్రివిక్రమ్ రాత్రింబవళ్లూ కష్టపడి స్క్రిప్టు ఫైనల్ చేసుకుని బన్ని కు నేరేషన్ ఇచ్చారు. దాంతో అల్లు అర్జున్ అటు వైపే మొగ్గి బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ అన్నారట. 

సరే ఆ కథతో మా తమ్ముడు అల్లు శిరిష్ కు ఓ హిట్ ఇవ్వచ్చు కదా అని కూడా ప్రపోజల్ పెట్టాడట. దాంతో అటు దాన్ని కాదనలేక...ఇటు స్టార్ హీరో డేట్స్ పోయాయని బాధతో సరే అన్నాడట. ఇప్పుడు ఆ స్క్రిప్టుని మళ్లీ అల్లు శిరీష్ కోసం మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఈ సినిమా హిట్ అయిన వెంటనే తనతో చేద్దువుగాని అని అల్లు అర్జున్ అనటం ఒకటే కాస్త ఓదార్పుని ఇచ్చే అంశంట. 

PREV
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?