Pushpa OTT:తగ్గేదేలే అంటున్న అమేజాన్, రిక్వెస్ట్ చేస్తున్న మేకర్స్?

By Surya Prakash  |  First Published Dec 30, 2021, 8:20 AM IST

ప్రేక్షకులను మెప్పించేలా కథ, కథనాలను తీర్చిదిద్దడంలో సుకుమార్‌ చాలా వరకు సఫలమయ్యాడు. ఈ నేపధ్యంలో యూత్ అంతా ఈ సినిమాని థియోటర్ లో చూసేసింది.  


  తగ్గేదేలే .. అంటూ విడుదలకు ముందు తెగ  హడావిడి చేసిన అల్లు అర్జున్ .. మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ సినిమాతో మాట నిలబెట్టుకున్నాడు. ఫ్యాన్స్ కి మంచి మాస్ ఫీస్ట్ ఇచ్చాడు.  ‘పుష్ప’ కోసం దర్శకుడు సుకుమార్‌ ‘ఎర్రచందనం’ స్మగ్లింగ్‌ నేపథ్యాన్ని, మాస్‌లో మంచి క్రేజ్‌ ఉన్న అల్లు అర్జున్‌ని హీరోగా ఎంచుకున్నాడు. ఈ పాయింటే ‘పుష్ప’పై ఎక్సపెక్టేషన్స్ ఏర్పడేలా చేసింది. అందుకు తగినట్లుగానే ప్రేక్షకులను మెప్పించేలా కథ, కథనాలను తీర్చిదిద్దడంలో సుకుమార్‌ చాలా వరకు సఫలమయ్యాడు. ఈ నేపధ్యంలో యూత్ అంతా ఈ సినిమాని థియోటర్ లో చూసేసింది. అక్కడ చూడనివారు ఓటీటిలో చూడాలని ఫిక్స్ అయ్యారు. దాంతో ఎప్పుడు ఓటిటి రిలీజ్ ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు.

ఇక  ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ వారు తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. కాగా మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం  ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న స్ట్రీమ్ కాబోతుంది. అయితే   ఇందులో ఎలాంటి నిజం లేదని మరో వార్త. మేకర్స్ ఈ చిత్రాన్ని ఇప్పుడప్పుడే ఓటిటి లో రిలీజ్ చేసే యోచనలో లేరని చెప్తున్నారు. జనవరి నెల తర్వాతే అందుబాటులోకి రావొచ్చు ఏమో కానీ త్వరగా అయితే వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. కానీ అమేజాన్ ఎగ్రిమెంట్ ప్రకారం ఏదైనా జరుగుతుంది. సినిమా వాళ్లకు ఇచ్చేసాక...డేట్ ఫిక్స్ చేసేది వాళ్లే ఉంటారు. అమేజాన్ ని రిక్వెస్ట్ చేసి, ఒప్పిస్తే తప్ప  మారేది ఉండదు.  సాధారణంగా పెద్ద సినిమా రిలీజ్ అయిన నాలుగు లేదా ఆరు వారాల తర్వాత ఓటీటిలో వచ్చేలా ఎగ్రిమెంట్ చేసుకుంటారు. నాలుగు వారాల ఎగ్రిమెంట్ అయితే పుష్ప చిత్రం జనవరి 14 నుంచి రిలీజ్ కానుంది. అమేజాన్ ను...కాస్త టైమ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. కానీ భారీ రేటుకు ఈ సినిమా కొనటంతో రికవరీలు కూడా చూసుకోవాలని అమేజాన్ చెప్తోందిట. మరి ఏం జరగనుందో చూడాలి.

Latest Videos

ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. థియోటర్ రిలీజ్ కు ముందే రైట్స్ భారీ మొత్తానికి అమేజాన్ కొనుగోలు చేసింది. అయితే రిలీజ్ కు ముందు ఎక్కడా ఈ విషయం బయిటకు లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం ఇవాళ సినిమా క్రెడిట్స్ సమయంలో బయిటకు వచ్చింది. ఎక్సక్లూజివ్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమేజాన్ సొంతం చేసుకుంది.

Also Read :Ajith Valimai : వాలిమై మూవీకి తెలుగులో క్రేజీ టైటిల్..? ఫ్యాన్స్ కు అజిత్ న్యూ ఇయర్ ట్రీట్
 
 శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో బన్నీ హీరోగా నటించారు.  ‘పుష్ప: ది రైజ్‌’ అల్లు అర్జున్‌ వన్‌ మ్యాన్‌ షో అని చెప్పవచ్చు. కథ మొదలైన దగ్గరి నుంచి పుష్పరాజ్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్‌ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టేశాడు. ఏ సన్నివేశం చూసిన ‘తగ్గేదేలే’ అంటూ ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయించాడు. చిత్తూరు యాస్‌లో బన్ని పలికిన సంభాషణలు అలరిస్తాయి. శ్రీవల్లిగా డీగ్లామర్‌ పాత్రలో రష్మిక నటన సహజంగా ఉంది.  రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

Also Read :Roundup 2021: 2022లో సందడి మొత్తం వీరిదే... వచ్చే ఏడాది తెలుగు తెరను ఊపేయనున్న పది మంది హీరోయిన్స్

click me!