ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మేకర్స్ మొత్తం 7 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇందులో ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా ఉందట.
రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో రాజమౌళి రూపొందించిన భారీ పాన్ ఇండియా చిత్రం “రౌద్రం రణం రుధిరం”.డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయటానికి ప్లాన్ చేసారు. గత కొద్ది రోజులుగా చిత్రం ప్రమోషన్స్ నిమిత్తం ఈ సినిమా నుంచి వేగంగా అప్ డేట్ లను వదులుతున్నారు. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మేకర్స్ మొత్తం 7 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇందులో ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా ఉందట. దీనితో పాటుగా ఈ చిత్రం 3డి లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాసం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మాగ్జిమం ఈ రోజే ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాసం ఉందటున్నారు.
ఓమ్రికాన్ ప్రభావంతో చాలా చోట్ల నైట్ కర్ఫూలు పెట్టారు. మహారాష్ట్ర,కర్ణాటక, న్యూ డిల్లీ, తమిళనాడులో అదే పరిస్దితి. అంటే సెంకండ్ షోలు ఉండవు.మిగతా రాష్ట్రాలు కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటన రావచ్చు అంటున్నారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం థియేటర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు రేపటి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయని తమిళనాడు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
పాన్ ఇండియా మూవీగా తీసుకొస్తున్న ఆర్ఆర్ఆర్ కు తమిళనాడు నుంచి భారీ రెస్పాన్స్ వస్తుందని రాజమౌళి భావించారు. ఇటీవల రాజమౌళి బృందం తమిళనాడు వెళ్లి భారీ ఎత్తున ప్రమోషన్లు కూడా చేసుకున్నారు. అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని అనుకుంటున్న నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం థియేటర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవటం పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు.
వేగంగా విస్తరిస్తున్న కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ ఆంక్షలు విధిస్తోంది. కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడం నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా బ్యాన్ చేసింది. ఒమిక్రాన్ పరిస్థితుల రీత్యా ఇప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవాలని ఆదేశించింది. దీంతో జనవరిలో ప్లాన్ చేసుకున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల కలక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతో రాజమౌళి ఆయన టీమ్ కలిసి వాయిదా నిర్ణయం తీసుకున్నారని వినపడుతోంది.
అయితే కొద్ది రోజుల క్రితం రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... "ఆర్ఆర్ఆర్" సినిమా వాయిదా పడదని, అనుకున్న తేదీనే విడుదల అవుతుందని కచ్చితంగా చెప్పారు. దీంతో అభిమానులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఆలియా భట్ మరియు ఓలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డి వి వి ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.
Also Read : Rise of Ram Song: రామం రాఘవం అంటూ నరనరాల్లో రక్తం ఉప్పొంగించారు