రిలీజ్ సమస్యలో ‘స్పై’?,నిర్మాతతో నిఖిల్ గొడవా?

By Surya Prakash  |  First Published Jun 12, 2023, 1:39 PM IST

 కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ. అయితే ఈ సినిమా చరిత్రలో ఓ రహస్యంగా మిగిలిపోయిన ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్రబోస్ మరణం చుట్టూ తిరిగే స్టోరీలా కనిపిస్తోంది.



 ప్రస్తుతం నిఖిల్‌ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘స్పై’ ఒకటి. ప్రముఖ ఎడిట‌ర్ గ్యారీ బీహెచ్ ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్లకు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది.  స్పై మూవీ టీజ‌ర్ రిలీజ్ త‌ర్వాత సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. అయితే స్పై మూవీ రిలీజ్ విష‌యంలో నిర్మాత రాజ‌శేఖ‌ర్‌కు, హీరో నిఖిల్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు ఏర్ప‌డ్డాయ‌నే టాక్ వినపడుతోంది.  

రీసెంట్ గా నిమాలో ఉన్న ఒక పాట‌ను   విడుద‌ల చేసేశారు. నిఖిల్  త‌న సినిమాలో పాట‌ను త‌నే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌లేదు. దాంతో నిర్మాత , హీరో మధ్యన వ్య‌వ‌హారం చాలా దూరం వెళ్ళిందంటున్నారు. అయితే అసలు వీళ్లమధ్యన ఏం జరిగిందనే దానకి మీడియాలో ఓ వెర్షన్ వినపడుతోంది.

Latest Videos

 స్పై మూవీని పాన్ ఇండియా రిలీజ్  కాబ‌ట్టి నిఖిల్ పెద్ద‌గా ప్ర‌మోష‌న్ చేయాల‌ని అన‌ుకుంటున్నాడట. కానీ నిర్మాత అంత టైమ్ రిలీజ్ కు టైమ్ తక్కవ ఉంది..రిలీజ్ డేట్ మారిస్తే ఇబ్బంది అయ్యిపోతుంది అని అంటున్నారు. అంతేకాకుండా  ఈ సినిమాకు సంభందించి జూన్ 15..16 తేదీల్లో స్పెష‌ల్ షూటింగ్‌ను ప్లాన్ చేశారు. దాన్ని పూర్తి చేసి జూన్ 23లోపు సెన్సార్‌కు పంపాలి.  ప్ర‌మోష‌న్స్ చేసుకుంటూనే ఇవ‌న్నీ చేయటం కష్టం కాబట్టి స్పై చిత్రాన్ని వాయిదా వేయాలంటూ నిఖిల్ అడిగితే నిర్మాత ప‌ట్టించుకోలేదు. స‌మ‌యం స‌రిపోతుంద‌ని త‌ను అంటున్నారు.

 అయితే హీరో మాట‌ల‌ను ప్రొడ్యూస‌ర్ లెక్క చేయ‌క‌పోవ‌టానికి కార‌ణం..ఆయ‌న సినిమాపై పెట్టిన మొత్తం నాన్ థియేట్రిల‌క్‌గానే వ‌చ్చేసింది. ఇక థియేట్రిక‌ల్ రిలీజ్ విష‌యంలో ఇప్ప‌టికే డిస్ట్రిబ్యూట‌ర్స్ నుంచి డ‌బ్బులు తీసేసుకున్నారు.  ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తే డిస్ట్రిబ్యూట‌ర్స్ కు ఏం సమాధానం చెప్పాలనేది ఆయ‌న వాద‌న‌.  స్పై మూవీ రిలీజ్‌కి దాదాపు ప‌ట్టుమ‌ని 15 రోజులే ఉన్నాయి.  నేతాజా సుభాష్ చంద్ర‌బోస్ మ‌ర‌ణం వెనకున్న ర‌హ‌స్యాన్ని చేదించే క‌థాంశంతోనే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌నే సుస్ప‌ష్టం. అయితే ఇదంతా మీడియాలో వినపడుతున్న విషయమే. ఎంతవరకూ నిజం ఉందనేది నిర్మాత గానీ, హీరోగానీ వచ్చి క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.
 
 జూన్ 29న విడుదల కాబోతున్న ఈ సినిమాలో స్వాతంత్రోద్యమ నేత సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ తో స్పష్టం చేశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈడి ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చ‌ర‌ణ్ తేజ్ ఉప్పల‌పాటిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్‌, ఐశ్వర్య మీనన్‌లు నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్‌ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం స్వరపరుస్తున్నారు.
 

click me!