Radhe Shyam:మేకర్స్ పై కోప్పడ్డ ప్రభాస్? ఇలాగైతే కష్టం

By Surya Prakash  |  First Published Dec 29, 2021, 9:27 AM IST

ఈ  పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. చాలా సంవత్సరాల తర్వాత రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా "రాధే శ్యామ్‌".  


ఓ ప్రక్కన రాజమౌళి తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ తో దూసుకుపోతున్నారు. ఎక్కడ చూసినా ఆర్ ఆర్ ఆర్ గురించే వినపడుతోంది. అలాగే పుష్ప సినిమా మేకర్స్ సైతం రిలీజైన తర్వాత ప్రమోషన్స్ పెంచేసారు. ఈ నేపధ్యంలో ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ ప్రమోషన్స్ పెద్దగా కనపడటం లేదు. ఈ సినిమాపై ఖచ్చితంగా చూడాలన్న బజ్ క్రియేట్ కావటం లేదు. ట్రైలర్ అద్బుతంగా ఉన్నా దాన్ని జనాల్లోకి  సరిగ్గా తీసుకెళ్ళపోయారనే టాక్ వినపడుతోంది. ఇందుకు కారణం ప్రమోషన్ యాంగిల్ లో సరైన ప్లాన్ లేకపోవటమే అంటున్నారు. అదే ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం కు ప్రమోషన్స్ ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. ఈ విషయం గమనించిన ప్రభాస్ ...దర్శక,నిర్మాతలపై సీరియస్ అయ్యారని అంటున్నారు. వెంటనే అర్జెంటుగా ప్రమోషన్స్ ప్లాన్ చేయమని చెప్పారట.

Also read Radhe Shyam: ‘రాధేశ్యామ్‌’ఓటీటి రిలీజ్ టైమ్,ఫ్లాట్ ఫామ్

Latest Videos

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాధేశ్యామ్ ప్రమోషన్స్ జనవరి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభాస్ ఇప్పటికే రాధేశ్యామ్ ప్రమోషన్స్ కోసం ప్యాన్ ఇండియా మీడియా అవుట్ లెట్స్ తో మాట్లాడుతున్నారు. కొత్త తరహాలో ప్రమోషన్స్ ప్లాన్ చేయాలని చెప్పారట. అలాగే వరసగా ప్రమోషన్ మెటీరియల్ మీడియాకు రిలీజ్ చెయ్యాలని అన్నారట. అదే సమయంలో పొరపాటున కూడా ఇదో యాక్షన్ సినిమా అన్నట్లు ప్రమోట్ చెయ్యద్దని ,ప్యూర్ లవ్ స్టోరీగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆదేశించారట.
  
ఇక ఈ  పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. చాలా సంవత్సరాల తర్వాత రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా "రాధే శ్యామ్‌". ఈ సినిమాలో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్ లో కనిపించబోతున్నారు. ఇది గొప్ప ప్రేమ‌క‌థ అని మోష‌న్ పోస్ట‌ర్‌తోనే రివీల్ అయ్యింది. మొన్న విడుదలైన విక్రమాదిత్య క్యారెక్ట‌ర్ టీజ‌ర్.. ఈ రాతలే పాటకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రాతలే పాటకు ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్‌లో రికార్డులు తిరగరాసింది ఈ పాట. అలాగే ఈ పాటలో పంచభూతాలను కలిపి చూపించారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా "రాధే శ్యామ్" చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కెకె రాధాకృష్ణ కుమార్. 

Also read RRR-Radheshyam: ముంచుకొస్తున్న ముప్పు.. వందల కోట్లు వదులుకోవాల్సిందేనా? రాజమౌళి, ప్రభాస్‌లో గుబులు ?

గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్. 60ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోంది.  ఇది కాలం, జాతకాలతో ముడిపడి ఉన్న ప్రేమ  కథని తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

click me!