Pushpa OTT: 'పుష్ప' ఓటీటీ రిలీజ్​ డేట్ ఫిక్స్? ఈ వారమే

By Surya Prakash  |  First Published Jan 3, 2022, 8:03 AM IST

థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా  ప్రదర్శితమవుతున్న ఈ సమయంలోనే  'పుష్ప' పార్ట్-1​ ఓటీటీ రిలీజ్​పై వార్తలు వస్తున్నాయి. అమెజాన్​ ప్రైమ్​లో విడుదలయ్యే ఈ చిత్ర​ రిలీజ్​ డేట్​ను ఖరారైందని తెలుస్తోంది.


ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' చిత్రం ఫ్యాన్స్ కు  ఫుల్​మీల్స్​ పెట్టేసింది. బన్నీ​-సుకుమార్​ కాంబినేషన్​ మరోసారి అదరగొట్టేసి కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నారు. రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయినా ఇప్పటికీ చాలా చోట్ల  ప్రేక్షకులు 'పుష్ప'ను చూసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. థియేటర్లలో ఈ మూవీ హవా కొనసాగుతుండగానే ఓటీటీ రిలీజ్​పై విస్తృతంగా చర్చ జరుగుతోంది.ఈ చిత్రం డిజిటల్​ రైట్స్​ ప్రముఖ ఓటీటీ అమెజాన్​ ప్రైమ్​ ఇప్పటికే కొనుగోలు చేసింది. అందుతున్న సమాచారం మేరకు జనవరి 7 నుంచి ఈ సినిమా ఓటీటి స్ట్రీమింగ్ కానుంది. అయితే అధికార ప్రకటన ఇంకా రాలేదు.

పుష్ప సినిమా డిసెంబర్ 17న విడుదలైన సంగతి తెలిసిందే. ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్ ల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాకు మొదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికి ఆప్రభవం సినిమా కలెక్షన్ పై మాత్రం పడలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవిలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కించాడు దర్శకుడు సుకుమార్.
 
  ‘పుష్ప: ది రైజ్‌’ అల్లు అర్జున్‌ వన్‌ మ్యాన్‌ షో అని చెప్పవచ్చు. కథ మొదలైన దగ్గరి నుంచి పుష్పరాజ్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్‌ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టేశాడు. ఏ సన్నివేశం చూసిన ‘తగ్గేదేలే’ అంటూ ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయించాడు. చిత్తూరు యాస్‌లో బన్ని పలికిన సంభాషణలు అలరిస్తాయి. శ్రీవల్లిగా డీగ్లామర్‌ పాత్రలో రష్మిక నటన సహజంగా ఉంది.  రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

Latest Videos

Also Read : Akhanda:'అఖండ' కు ఆంధ్రాలో కొత్త సమస్య, చర్చల్లో నిర్మాత?

click me!