ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్‌తో పృధ్వీరాజ్ సంప్రదింపులు జరపుతున్నాడన్నది ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్. పృధ్వీరాజ్ సినిమాలకు బడ్జెట్ పరంగా లిమిటేషన్స్ ఉంటాయి.
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, రానా కలిసిన నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్టైంది. మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకు రీమేక్ గా రూపొందిన చిత్రమిది. అహంకారానికి ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. మాతృకలోని ఆ చిన్న పాయింట్ ను తీసుకొని తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేశారు. ‘భీమ్లానాయక్’ (Pawan Kalyan Bheemla Nayak) ఒరిజినల్ వెర్షన్‌లో నటించింది కూడా పృధ్వీరాజే.
'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రాన్ని మళయాళ హీరో, దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ డైరక్ట్ చేసారు. అప్పటి నుంచీ పృధ్వీరాజ్ సుకుమారన్ తో పవన్ కు పరిచయం ,స్నేహం ఏర్పడ్డాయి. ఈ క్రమంలో పృధ్వీరాజ్ సుకుమారన్ టాలెంట్ నచ్చిన పవన్ ...ఆయన తో సినిమా చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజం చేస్తూ పవన్ ని కలిసి, స్టోరీ లైన్ నేరేట్ చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే వరస సినిమాలు కమిటైన పవన్ ...ఇప్పుడు పృధ్వీతో సినిమా చేసేటంత తీరిక ఎక్కడుందని అంటున్నారు.
ఏదైమైనా స్వీయ దర్శకత్వంలో పృధ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఓ సినిమా తెరకెక్కించేందుకు తాజాగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్‌తో పృధ్వీరాజ్ సంప్రదింపులు జరపుతున్నాడన్నది ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్. పృధ్వీరాజ్ సినిమాలకు బడ్జెట్ పరంగా లిమిటేషన్స్ ఉంటాయి. అదే సమయంలో, చాలా క్వాలిటీతో ఆయన సినిమాలుంటాయి. పైగా, తక్కువ సమయంలోనే సినిమాల నిర్మాణం కూడా పూర్తయిపోతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య ఇలాంటి ఆలోచనలతోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
‘భీమ్లానాయక్’ సినిమాని చూశాక, పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని పృధ్వీరాజ్ అనుకుంటున్నాడట. మలయాళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో సినిమా తెరకెక్కించాలనే ఆలోచనతో వున్న పృధ్వీరాజ్, తెలుగు వెర్షన్‌లో మాత్రమే పవన్ కళ్యాణ్ నటించేలా, మలయాళంలో తాను నటించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. ఈ వార్తలో నిజమెంతోగానీ, పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అంటే.. అది ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేస్తుందన్నది నిజం.
పృధ్వీరాజ్ సుకుమారన్ మంచి నటుడు. అభిరుచిగల దర్శకుడు, నిర్మాత కూడా. విలక్షణహైన కథల్ని ఎంచుకుంటూ, మలయాళంలో సూపర్ స్టార్ అనదగ్గ స్థాయి సంపాదించుకున్నాడు. స్టార్ డైరెక్టర్ అనే గుర్తింపూ తెచ్చుకున్నాడు. తెలుగులో చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ సినిమాకి తమిళ మాతృక అయిన ‘లూసిఫర్’ చిత్రానికి దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్.