#Ram Charan:శంకర్ సినిమాకు ...రామ్ చరణ్ ఎంత ఇస్తున్నారో తెలిస్తే షాకే

By Surya Prakash  |  First Published Dec 19, 2022, 5:05 PM IST

#ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
 



ప్రస్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో ప్రస్తుతం పీక్స్ కు చేరుకున్నారు.  అయితే  "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంటనే ... చరణ్ "ఆచార్య" సినిమా తో డిజాస్టర్ అందుకున్నారు.  దాంతో ఆయన దృష్టి మొత్తం ఇప్పుడు స్టార్ డైరక్టర్ శంకర్ తో చేస్తున్న RC 15 అనే మరో భారీ ప్రాజెక్ట్‌ పై ఉంది.గత కొద్ది కాలంగా   RC 15 షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఆయన అభిమానులం అందరి దృష్టీ ఈ సినిమాపైనే ఉంది.  
 
రాంచరణ్ కెరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కతోన్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే...ఈ సినిమాకోసం రామ్ చరణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్. 
RRRతో, రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. దాంతో ఇప్పుడు ఆయన  ప్రతి సినిమా పాన్-ఇండియన్ చిత్రంగా మారి బడ్జెట్లు మారుతున్నాయి. తాజా చిత్రం బడ్జెట్  300 కోట్లు అంటున్నారు. స్టార్‌కి మార్కెట్‌ ఉన్నంత వరకు, సినిమా కమర్షియల్‌గా నిలదొక్కుకునేంత వరకు నిర్మాతలు ఈ బడ్జెట్‌లకు ఓకే అని దిల్ రాజు ముందుకు వెళ్తున్నారు. 

ఈ క్రమంలో రామ్ చరణ్ ఈ సినిమా కోసం 100 కోట్ల రెమ్యునరేషన్ కోట్ చేసినట్లు తెలుస్తోంది.  నిర్మాత దిల్ రాజు సైతం ఈ రెమ్యునరేషన్ కు నో చెప్పలేదని అంటున్నారు. అలాగే ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ కోసం దర్శక నిర్మాతలు భారీగా ఖర్చుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.   శంకర్ ఈ సినిమాలో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్ ను కూడా ప్లాన్ చేశారట. కేవలం ఈ ఒక్క సీన్ కోసమే నిర్మాతలు 10 కోట్ల వరకు ఖర్చు చేసిన్నట్లుగా తెలుస్తోంది.  ఈ సన్నివేశం సినిమాకి హైలైట్ గా మారుతుందని సమాచారం. అంజలి, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
 మరో ప్రక్క రామ్ చరణ్ ... ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్ట్ ని ఓకే చేసాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుంది . ఈ సినిమా సైతం భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా చిత్రం అవుతుంది.

Latest Videos

click me!