#NTR:'అన్ స్టాపబుల్-2' తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ ?ఎందుకా కెలకటం

By Surya Prakash  |  First Published Dec 18, 2022, 6:23 AM IST

గెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. అలాగే పనవ్ కళ్యాణ్ సైతం ఫిక్స్ అయ్యారు.  



టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న సెన్సేషనల్ టాక్ షో... అన్ స్టాపబుల్-2. ఈ అన్​స్టాపబుల్​ టాక్ షోతో (ఆహాలో) బాలక్రిష్ణ ఓటీటీ ప్లాట్ ఫామ్ ని షేక్ చేసేస్తున్నాడు.. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులతో జరిపే ముచ్చట్లతో ప్రేక్షకులను అలరిస్తూ హోస్ట్ గా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. గత సీజన్ కు వచ్చిన సూపర్ రెస్పాన్స్ తో, రెండో సీజన్ మొదలుపెట్టి దుమ్ము రేపుతున్నాడు. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో మొదలుపెట్టి అదే హవాను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు అన్​స్టాపబుల్​  షోకి వచ్చారు. తదుపరి గెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. అలాగే పనవ్ కళ్యాణ్ సైతం ఫిక్స్ అయ్యారు.  ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. 

అదేమిటంటే.... ఈ షోకు జూ.ఎన్టీఆర్ వస్తారా..రారా అని. అలాగే చిరంజీవిని పిలుస్తారా పిలవరా అని. చాలా మంది వీళ్లిద్దరిని పిలిచే అవకాసం లేదంటూ తేల్చేస్తున్నారు.  అందులో నిజమెంత ఉందో లేదో కానీ...పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. కానీ కొందరు జూ.ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో  హర్ట్ అయ్యినట్లు పోస్ట్ లు కనపడుతున్నాయి. 

Latest Videos

బాలయ్య లిస్ట్ లో ఎన్టీఆర్ లేకపోవటం ఏమిటి అంటున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా...ఇక ఎన్టీఆర్ ని పలవరు అని కొన్ని మీడియా సంస్దలు పనిగట్టుకుని కన్ఫర్మ్ చేసినట్లుగా రాసేస్తున్నాయి. అభిమానులు హర్ట్ అయ్యేలా కెలుకుతున్నారు. సర్పైజ్ లతో సాగే ఈ షోకు ఎవరు గెస్ట్ లుగా వస్తారని ఎప్పుడూ ఆశ్చర్యమే.  పవన్ కళ్యాణ్ వస్తారని ఎవరైనా అనుకున్నారా...అలాగే ఎన్టీఆర్ కూడా ఓ ఎపిసోడ్ లో సర్పైజ్ గా ఎంట్రీ ఇచ్చే అవకాసం ఉందంటున్నారు. అదే కనుక జరిగితే భూమి బ్రద్దలైనట్లు, వ్యూయర్ షిప్ అదిరిపోతుందనటంలో సందేహం లేదు. 

ఇక ఈ కార్యక్రమం తాజా ఎపిసోడ్ కు టాలీవుడ్ హీరోలు ప్రభాస్, గోపీచంద్ విచ్చేశారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రోమోను ఆహా యూట్యూబ్ లో విడుదల చేసింది. ఫుల్ ఎపిసోడ్ డిసెంబరు 30న ఆహా ఓటీటీ యాప్ లో ప్రసారం కానుంది.  ఇప్పటికే రిలీజైన ప్రోమో చూస్తే... బాలకృష్ణ ఎప్పట్లానే తనదైన శైలిలో నవ్వుల జడివాన కురిపించారు. ప్రభాస్, గోపీచంద్ ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో కామెడీ బాగా వర్కౌటైంది. అరే, ఒరే అనుకుంటూ ఇద్దరూ తమ ఫ్రెండ్షిప్ ను ప్రదర్శించడం ఆకట్టుకుంది. అంతేకాదు, షో మధ్యలో రామ్ చరణ్ ఫోన్ చేసి ప్రభాస్ సీక్రెట్ ఒకటి బయటపెట్టగా... 'రేయ్ చరణూ... నువ్వు నా ఫ్రెండువా, శత్రువువా!' అంటూ చిరు కోపం ప్రదర్శించారు. 

బాలయ్య పెళ్లి మాటెత్తగానే... సల్మాన్ ఖాన్ తర్వాత చేసుకుంటానని ప్రభాస్ చమత్కరించారు. టాక్ షో ఆద్యంతం ఇలాంటి చమక్కులతో ఆడియన్స్ కు వినోదాల పండుగలా ఉంటుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

click me!