పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం లో పవన్ దేవుడిగా కనిపిస్తుండగా.. తేజ్.. డాక్టర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో తేజ్ సరసన కేతిక శర్మ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 28 న రిలీజ్ కానుంది.
మెగా మేనల్లు సాయిధరమ్ తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ తాజాగా బ్రో అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన షూటింగ్‌ను దాదాపు కంప్లీట్ చేసేశారు. ఇక, ఇప్పుడు సాయి ధరమ్ తేజ్‌పై ఫేమస్ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. మరికొద్ది రోజుల్లో టాకీ పార్ట్ కంప్లీట్ కాబోతుంది.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ కూడా షురూ చేయనున్నారు . ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఇద్దరు మెగా హీరోలు కలిసి నటిస్తున్నారు కాబట్టి ఓ భారీ వేదికను ఏర్పాటు చేసి ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు నిర్మాణ సంస్ద సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ వేడుక రాజమండ్రిలో జరగనుందని టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చేస్తోన్న వారాహి యాత్ర అటు వైపే ఉండటంతో అక్కడే ఈ ఈవెంట్ ని నిర్వహించాలని ప్లాన్ చేయమని పవన్ సూచించారట. అయితే అంత భారీ ఈవెంట్ జరగటానికి ప్రభుత్వం నుంచి ఫర్మిషన్ కావాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా కావటంతో ఫర్మిషన్స్ విషయంలో ఇబ్బందులు ఎదురు అవుతాయా అనేది ఆలోచిస్తున్నారట.
ఈ సినిమా టీజర్ ను ఈ నెల 28 న కానీ, 29 న కానీ రిలీజ్ చేయనున్నారట. ఇక వచ్చే నెల మొదటి వారంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే ప్లాన్ చేస్తున్నారట.
అయితే హైదరాబాద్ లో అయితే బాగుంటుందనే టీమ్ లో కొందరు అభిప్రాయ పడుతున్నారట. ఈ విషయమై త్వరలోనే అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్.
ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కోలీవుడ్ లో హిట్ టాక్ అందుకున్న వినోదాయ సీతాం చిత్రంకు బ్రో అధికారిక రీమేక్. కాగా, మాటల మాంత్రికుడు ఈ చిత్రానికి డైలాగ్స్ అందివ్వడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. మరి బ్రో డ్యూ.. ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.