ఒక్కొక్క సినిమాకు పాతిక కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 100 కోట్ల రూపాయల డీల్ ఫైనల్ అయినట్టు చెప్పుకుంటున్నారు.
వయస్సుతోనూ,సక్సెస్ రేటుతోనూ సంభందం లేకుండా వరస ప్రాజెక్టులతో రవితేజ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ధమాకా వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంటనే రావణాసుర వంటి డిజాస్టర్ ఇచ్చారు. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ తో కలిసి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అక్టోబర్ లో టైగర్ నాగేశ్వరరావు గా రాబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈగల్ గా థియేటర్స్ లోకి దిగబోతున్నాడు. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్ధతో వంద కోట్ల డీల్ సెట్ చేసుకున్నారని సమాచారం.
సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ..ప్రస్తుతానికి రవితేజ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో ఈగల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. అంతకు ముందు ధమాకా కూడా ఇదే బ్యానర్ లో చేసారు. ఈ క్రమంలోనే ఆ నిర్మాతలతో రవితేజకు సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడటంతో ఈ డీల్ ప్రపోజల్ పెట్టారని తెలుస్తోంది.
తెలుగులో అతివేగంగా 100 సినిమాలు నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రవితేజతో వందకోట్ల డీల్ కూడా మాట్లాడుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్క సినిమాకు పాతిక కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 100 కోట్ల రూపాయల డీల్ ఫైనల్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఆ సినిమాల లిస్ట్ లో ఒక సినిమా కలర్ ఫోటో ఫ్రేమ్ దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ వంద కోట్ల డీల్ మేటర్ లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది. కొందరైతే ఇదంతా మీడియా సృష్టించిన రూమర్ అని కొట్టిపారేస్తున్నారు.