ఎన్టీఆర్, కొరటాల మూవీ టైటిల్ లీక్, అదిరిపోయిందిగా!

By Surya Prakash  |  First Published Apr 12, 2023, 12:44 PM IST

 పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ పోషిస్తున్నారు.


ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా మొదలైన సంగతి తెలిసిందే.  NTR 30 గా వర్కింగ్ టైటిల్ గా చెప్పబడుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.  డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబూ సిరిల్‌, సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు క‌లిసి ఓ అదిరిపోయే మాస్ ఎంటర్టైన్మెంట్ ని రెడీ చేస్తున్నారు.   రీసెంట్ గా జరిగిన ప్రారంభోత్సవంలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు కొరటాల శివ. మృగాలను వేటాడే మగాడిగా ఎన్టీఆర్ రోల్ శక్తివంతంగా ఉంటుందని అన్నారు. దీంతో ఓ రేంజ్ హైప్ నెలకొంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే స్టైలిస్ట్ అలీమ్ హ‌కీమ్ షేర్ చేసిన ఫొటోలో ఎన్టీఆర్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించాడు. ఎన్టీఆర్ జోడీగా ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయమవుతోంది.  ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. మీడియాలో ..ఎన్టీఆర్ 30వ సినిమాగానే  చెప్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమాకి 'వస్తున్నా' అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. అందుకు కారణం ...రీసెంట్ గా బన్నీ బర్త్ డే సందర్భంగా 'పార్టీ లేదా పుష్ప' అని ఎన్టీఆర్ అడిగితే, 'వస్తున్నా' అని బన్నీ సమాధానమివ్వటమే అంటున్నారు.

Latest Videos

ఇక అప్పటి నుంచి ఇదే ఆ సినిమా టైటిల్ అయ్యుంటుందనే వార్తలు  మొదలయ్యాయి. బన్నీకి ముందుగా ఆ టైటిల్ గురించి తెలియడం వల్లనే ఆయన ఆ మాటను ఉపయోగించాడని అంటున్నారు. ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తుండటం నందమూరి అభిమానులను హుషారెత్తిస్తోంది. తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ నటిస్తున్నారని టాక్.

ఎన్టీఆర్ 30 కోసం భారీస్థాయిలో సెట్స్ వేయబోతున్న టీమ్.. గోవా, విశాఖ పట్నం వంటి ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్‌ షూట్ చేయనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 30వ సినిమా. ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువ సుధా ఆర్ట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  

click me!