చివరిగా వచ్చిన అంటే సుందరానికి సినిమా తేడా కొట్టడంతో ఇప్పుడు దసరా సినిమా పై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఊర మాస్ మసాలా సినిమాగా వస్తోన్న ఈ మూవీలో నాని
సినిమా సక్సెస్ నటులకు తమపై తమకు కాన్ఫిడెన్స్ ఇవ్వటమే కాకుండా ఫైనాన్సియల్ గానూ హైక్ ఇస్తుంది. ‘దసరా’హై సక్సెస్ తో నాని కాన్ఫిడెన్స్ పెరగడమే కాకుండా ఆ తర్వాతి సినిమాల మార్కెట్ విలువ కూడా పెరిగింది. నాని కెరీర్‌లో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాకి ముందు తన రెమ్యునరేషన్ ని పెంచేశాడు. అతను ఇప్పుడు 20% పెంచాలని డిమాండ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రూ.20 కోట్ల క్లబ్‌లో చేరి తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు.
ఈ క్రమంలో నాని తన రెమ్యునరేషన్ ను పెంచేశారనేది పెద్ద విషయం కాదంటున్నారు. నాని ప్రస్తుతం ఒక సినిమా కోసం 22 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. అందుకునే నిర్మాతలు కూడా నాని రెమ్యునరేషన్ కు ఓకే చెప్తున్నారని టాక్.
దసరా సినిమా సక్సెస్ అయిన తర్వాత నానికి వరుస నిర్మాణ సంస్థల నుండి అడ్వాన్స్ ల రూపంలో బోలెడన్ని చెక్కులు ఆఫర్స్ వస్తున్నాయి. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమాకి నాని ఓకే చెప్పలేదు. మంచి స్క్రిప్ట్ లు ఎంచుకుని సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. సెల్ఫ్ మేడ్ స్టార్ గా రవితేజ తర్వాత నాని కూడా చోటు సంపాదించుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని- తండ్రీకూతుళ్ల బాండింగ్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల , మూర్తికె.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో నానికి జోడీగా అందాల భామ మృణాల్ ఠాకుర్ నటిస్తోంది.