‘సలార్’కు 200 కోట్ల డీల్,డిటేల్స్

By Surya Prakash  |  First Published Apr 9, 2023, 4:16 PM IST

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రెస్టీజియస్‌గా వస్తున్న సినిమా ‘సలార్’. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, 
 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ  ప్రతీ విషయంలోనూ సెన్సేషన్ గా మారుతోంది. ఈ సినిమాపై అఫీషియల్ గా పెద్దగా అప్డేట్స్ రాకపోయినా అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.   కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్లు అందించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబరులో ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. రెండు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు సలార్ ఓటీటీ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం మేకర్స్‌కు 200 కోట్ల వరకు ఇచ్చేందుకు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ మధ్య సలార్ డిజిటల్ రైట్స్‌ కోసం పోటీ నెలకొందని చెప్తున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన గత చిత్రాలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2 రెండు చిత్రాలను ప్రైమ్ వీడియోనే కొనుగోలు చేసింది. దీంతో సలార్ రైట్స్ కూడా సదరు ఓటీటీ సంస్థే దక్కించుకోవాలని చూస్తోంది. మిగిలిన అన్నింటికంటే ఈ విషయంలో అమెజాన్ ప్రైమ్ కాస్త ముందుంది.

Latest Videos

ఇది కాకుండా నెట్‌ఫ్లిక్స్ కూడా సలార్ డిజిటల్ హక్కుల కోసం పోటీ పడుతోందని సమాచారం. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కంటే 20 నుంచి 30 శాతం ఎక్కువ ఆఫర్ చేసేందుకు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే డిజిటల్ రైట్స్ ద్వారే సలార్ మేకర్స్ లాభాల బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇవి కాకుండా శాటిలైట్ హక్కులు కూడా ఉండటంతో మేకర్స్‌కు లాభాలు పక్కాగా వస్తాయని ట్రేడ్  అంచనా వేస్తోంది.

ఇదిలా ఉంటే ‘సలార్’ మూవీ ఓవ‌ర్ సీస్ హ‌క్కుల విష‌యంలో ఓ రేంజిలో  క్రేజ్ వ‌చ్చింది. దీంతో మేక‌ర్స్   ఈ మూవీ ఓవ‌ర్ సీస్ హ‌క్కుల కోసం ఏకంగా రూ.70 కోట్లు ఫిక్స్ చేశారని సమాచారచం. అంటే స‌లార్ ఓవ‌ర సీస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఏకంగా 9 మిలియ‌న్ డాల‌ర్స్‌ను రాబ‌ట్టాల్సి ఉంటుంది. బాహుబ‌లి సినిమా కె.జి.య‌ఫ్, ఆర్ఆర్ఆర్‌ చిత్రాల త‌ర్వాత ఆ రేంజ్ రేట్‌ ఓవ‌ర్ సీస్ రైట్స్‌కు ఫిక్స్ చేశారు. ఈ క్రేజ్ కు కార‌ణం..  ప్ర‌భాస్,  ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ అని ట్రేడ్ వ‌ర్గాలు సమాచారం.

ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ సలార్ సినిమా గురించి మాట్లాడుతూ ఏ సినిమాలో ప్రభాస్ ని ఇంతవరకు ఎప్పుడు చూపించని విధంగా చూపిస్తున్నట్లు చెప్పారు . చాలా నమ్మకంగా చెబుతున్నాను కానీ ఆయన సలార్ సినిమాలోని ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెప్పాడు. ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని సినిమాలో నేను చాలా క్రూరంగా కనిపిస్తానని చెప్పాడు. ఇలాంటి పాత్రలు ఇంతకుముందు ఎప్పుడూ నటించలేదు అని ఆయన చెప్పారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబళే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. పాన్ఇండియా రేంజ్‌లో సినిమా విడుదల చేయనుంది. ఈ మూవీ రెండు భాగాలుగా ఉంటుందనే టాక్ అయితే సినీ సర్కిల్స్‌లో గట్టిగానే వినిపించింది. 

click me!