తల పట్టుకున్న త్రివిక్రమ్, సమస్యగా మారిన ప్రకాష్ రాజ్! ?

By Surya Prakash  |  First Published Jun 3, 2023, 4:04 PM IST

ఇప్పుడు కొత్త డేట్స్ అంటే ప్రకాష్ రాజ్ కి సమస్యగా మారిందట. ఆయనకున్న కమిట్మెంట్స్ రీత్యా మహేష్ మూవీకి రివైజ్ చేసిన డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదని సమాచారం. 
 



కొన్ని కాంబినేషన్స్ చూడటానికి తెరపై అదిరిపోతాయి. కానీ వాటిని సెట్ చేయటానికి దర్శక,నిర్మాతలు నానా బాధలు పడుతూంటారు. ఇదిగో ఇప్పుడు అలాంటి సమస్యే మహేష్ బాబు తాజా చిత్రానికి వచ్చిందంటున్నారు.  దాదాపు పదమూడేళ్ళ అనంతరం మహేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలసిందే.  అతడు,  ఖలేజా చిత్రాల తర్వాత  గుంటూరు కారం చేస్తున్నారు.

ఈ సినిమా తాజా  షెడ్యూల్ జూన్ 7 నుండి అనుకున్నారు. అది కూడా వెనక్కిపోయిందట.  అయితే అది జూన్ 10న స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. ముందుగా అనుకున్న డేట్స్ అన్నీ మారిపోయాయి. క్యాన్సిల్ చేసి నటుల వద్ద కొత్త డేట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మిగతా నటులతో ఎలాంటి సమస్య లేదు. కానీ ప్రకాష్ రాజ్ విషయంలో ఇబ్బందులు తలెత్తెందని సమాచారం . ఆయన ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ జరగలేదు. ఎప్పుడు కొత్త డేట్స్ అంటే ప్రకాష్ రాజ్ కి సమస్యగా మారిందట. ఆయనకున్న కమిట్మెంట్స్ రీత్యా మహేష్ మూవీకి రివైజ్ చేసిన డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదని సమాచారం. అయితే ఇవి ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న వార్తేనా లేక రూమరా అని తెలియాల్సి ఉంది. 

Latest Videos

ఇవన్నీ నాకు తెలియదు అంటూ మహేష్ బాబు... చిత్ర షూటింగ్ అక్టోబర్ చివరికల్లా పూర్తి చేయాలని కండీషన్ పెట్టారట. అందుకు కంటిన్యూగా షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. మరి ప్రకాష్ రాజ్ కి మహేష్ పెట్టిన కండిషన్స్ ప్రకారం డేట్స్ ఇవ్వడం కుదురుతుందా? లేదా? అనే సందిగ్ధత కొనసాగుతుంది. త్రివిక్రమ్ తలపట్టుకు కూర్చున్నారట. 

ఇక కృష్ణ జయంతి సందర్భంగా మే 31న గుంటూరు కారం ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. మహేష్ బాబు ఊరమాస్ అవతార్ ఆకట్టుకుంది. వాచ్ ఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం విడుదల కానుంది. 

దాదాపు పదమూడేళ్ళ అనంతరం మహేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ తెరకెక్కుతుంది. అతడు ఖలేజా చిత్రాల అనంతరం గుంటూరు కారం చేస్తున్నారు. మహేష్ తండ్రి చనిపోవటం, తర్వాత మరిన్ని కారణాలతో ఈ చిత్రం  సెట్స్ పైకి వెళ్లేందుకే ఆలస్యమైంది. ఒక షెడ్యూల్ మొదలయ్యాక మధ్యలో ఆగిపోయింది. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేశారని తెలిసింది. అలాగే మహేష్-త్రివిక్రమ్ మధ్య మనస్పర్థలు తలెత్తాయనే వాదన వినిపించింది. అందుకే మహేష్ షూటింగ్ మధ్యలో వదిలేసి విదేశీ టూర్ కి వెళ్లారని అన్నారు. ఈ వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. దాదాపు రెండు నెలలుగా గుంటూరు కారం షూటింగ్ బ్రేక్ పడింది. 

పూజా హెగ్డే మహేష్ కి జంటగా నటిస్తుంది. గతంలో వీరిద్దరూ మహర్షి చిత్రం చేశారు. త్రివిక్రమ్ తో పూజా హెగ్డేకి వరుసగా మూడో చిత్రం ఇది. శ్రీలీల మరొక హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

 
 
 

click me!