. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టార్ మూవీగా బ్రో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగులో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. దానికి తోడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటించడంతో మెగా ఫాన్స్ లో ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ మరింత పెరిగాయి. . ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో మొదలైంది. అయితే ఈ సినిమాకు రేట్లు ఓ రేంజిలో చెప్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్ర ఏరియాకు కి గాను 70 కోట్లు అడుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అంత పెట్టి సినిమా తీసుకుంటే రికవరీ ఏ మాత్రం ఉంటుందనే లెక్కలు వేస్తున్నారు. ఆంధ్రాలో టిక్కెట్ రేట్లు తక్కువ...పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి పెంచే అవకాసం లేదు. మరి అలాంటప్పుడు 70 కోట్లు పెడితే ఏ స్దాయ హిట్ కావాలి. సినిమా బ్లాక్ బస్టర్ అయితేనే బ్రేక్ ఈవెన్ ఒక వారంలో వస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ వీకెండ్ లో వచ్చిందే మిగులు అని లెక్కలు వేస్తున్న నేపధ్యంలో ఓపినింగ్స్ వస్తేనే ఏ పెద్ద సినిమా కు అయినా వర్కవుట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇంకా ప్రమోషన్స్ పూర్తి స్దాయిలో మొదలెట్టలేదు. అప్పుడు కానీ అంచనాకు రాలేమని ప్రమోషన్స్ కోసం బయ్యర్లు వెయిట్ చేస్తున్నారు.
undefined
ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రోజుకు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఈ సినిమా కోసం పవన్ దాదాపు 20 నుంచి 25 రోజులు వర్క్ చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ దాదాపు 50 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ మూవీకి అందరి రెమ్యునరేషన్ లతో కలుపుకొని రూ. 120 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. అంటే ఆ స్దాయిలనే అమ్మాలి.
ఇక ఈ సినిమా తమిళంలో వచ్చిన వినోదయ సీతం సినిమాకు రీమేక్. దర్శకుడు త్రివిక్రమ్ ,రైటర్ సాయి మాధవ్ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి పవన్ క్రేజ్ కి తగ్గట్టుగా ఆయన పాత్రను మలిచారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ మొత్తంలో ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందే దాదాపు 50 కోట్ల లాభాలు పీపుల్స్ మీడియా కళ్ల చూసే అవకాసం ఉందంటున్నారు.