నాచురల్ స్టార్ నాని (Nani) స్టార్ డైరెక్టర్స్‌ను నమ్ముకునే కంటే కూడా కథ, కథనం బాగా పట్టున్న కొత్త దర్శకులతో సినిమాలు చేయడం నయం అనుకుంటున్నాడు. అందుకే క్రేజీ దర్శకులను కాకుండా ఒకట్రెండు సినిమాల అనుభవం ఉన్న వాళ్లతోనే ఎక్కువగా కానిచ్చేస్తున్నాడు.
నాని తాజా చిత్రం అంటే సుందరానికి మొన్న శుక్రవారం రిలీజై థియేటర్లలో రన్ అవుతోంది. ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా చిత్రంలో నాని తన నటనకు ప్రశంసలు ఈ నేపధ్యంలో నాని తన నెక్ట్స్ ప్రాజెక్టు ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, నాని తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లలో ఒకదాని కోసం C/O కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా స్క్రిప్టు ఓకే చేసారు. ఇది నాని30, అతని 30వ ప్రాజెక్ట్. ఈ చిత్రాన్ని థీరజ్ మొగిలినేని నిర్మించనున్నారు. త్వరలో అఫీషియల్ గా ప్రకటించనున్నారు.
కేరాఫ్ కంచర్ల పాలెం తర్వాత సత్యదేవ్ తో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాన్ని తెరకెక్కించారీ యంగ్ డైరక్టర్. సెన్సిబుల్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ వెంకటేష్ మహా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే అంతే సుందరానికి సినిమాలో పెద్ద గెస్ట్ రోల్ కూడా చేసాడు. సినిమాలో హీరోయిన్ లీలాని పెళ్లాడేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేష్ మహా కనిపించాడు.డైరక్టర్ నటుడిగా అవడం ఇదేమి కొత్తేమి కాదు ఈమధ్యనే యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ మహా కూడా అదే రూట్ లో వెళ్తున్నాడు. వెంకటేష్ మహా కూడా అటు డైరక్షన్ ఇటు యాక్షన్ రెండూ బ్యాలెన్స్ చేస్తున్నారు.
నాని అంటే సుందరానికీ సినిమా కొద్దిగా లెంగ్త్ ఎక్కువ అన్న టాక్ వచ్చినా సినిమా మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకుంటోంది. ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం ‘దసరా’. రొటీన్‌కు భిన్నంగా నాని ఈ సారి పూర్తీ మాస్ సినిమాతో రాబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన నాని ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలను నమోదు చేశాయి. ఈ చిత్రంలో నాని సరసన కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో నాని, కీర్తీ డీ గ్లామర్ పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణ్ స్వరాలను సమకూరుస్తున్నాడు.