Mahesh:గెస్ట్ రోల్ లో మహేష్ , విక్రమ్ లో 'సూర్య' చేసినట్లు?

By Surya Prakash  |  First Published Jun 9, 2022, 9:14 AM IST

 మహేష్ లాంటి హీరో తన సినిమాలో ఉంటే ఓపినింగ్స్ కు బూస్ట్ ఉంటుందని భావిస్తున్నారట. అలాగే మహేష్ బాబుకు సైతం తమిళ మార్కెట్ కలిసి వచ్చే అంశం. కోలీవుడ్, టాలీవుడ్ సూపర్ స్టార్స్‌ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తే.. ఆ కిక్కే వేరంటున్నారు ఫ్యాన్స్.


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. గెస్ట్ రోల్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది..సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ వస్తుంది కదా..కాకపోతే మహేష్ ని ఒప్పించగలిగాలి. ఎందుకంటే ఆయన గెస్ట్ గా ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఇప్పటిదాకా తనను అడిగిన  స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ అందించిన మహేష్.. ఈ సారి మాత్రం అథితి పాత్రలో మెరిసే అవకాసం ఉందని అంటున్నారు. అది కూడా దిల్ రాజు రిక్వెస్ట్ మీదే అంటున్నారు. ఇంతకీ ఏ సినిమాలో అంటే... ఓ తమిళ హీరో చేస్తున్న చిత్రంలో అని తెలుస్తోంది. గెస్ట్ చేసే ఉంటారు...కరెక్టే మీ ఊహ..అది హీరో విజయ్ సినిమా. ఈ సినిమాలో మహేష్ ని గెస్ట్ రోల్‌ కనిపించటానికి ఒప్పిస్తున్నారట. విక్రమ్ లో సూర్య చివర్లో వచ్చి ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకున్నట్లు మహేష్ పాత్రను కూడా డిజైన్ చేసారట.
 
వివరాల్లోకి వెళితే... సర్కారు వారి పాటతో సాలిడ్ హిట్ అందుకున్న మహేష్ బాబు..   ఓ సినిమాలో గెస్ట్ రోల్‌లో కపించబోతున్నాడనే వార్త వైరల్‌గా మారింది. అది కూడా తన ఫ్యాన్స్‌కు నచ్చని  హీరో సినిమాలో కావటం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం.  ప్రస్తుతం విజయ్ 66వ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలోనే మహేష్ ఓ అతిథి పాత్రకు అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ ఎంత ఇక్కడ సినిమాలు ఆడినా తమిళ హీరో క్రిందే చూస్తారు. దాంతో మహేష్ లాంటి హీరో తన సినిమాలో ఉంటే ఓపినింగ్స్ కు బూస్ట్ ఉంటుందని భావిస్తున్నారట. అలాగే మహేష్ బాబుకు సైతం తమిళ మార్కెట్ కలిసి వచ్చే అంశం. కోలీవుడ్, టాలీవుడ్ సూపర్ స్టార్స్‌ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తే.. ఆ కిక్కే వేరంటున్నారు ఫ్యాన్స్.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే! ఆ తర్వాత ఆయన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ అడ్వెంచరస్ యాక్షన్ త్రిల్లర్ (SSMB29) చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్‌తో జక్కన్న సూపర్ బ్లాక్‌బస్టర్ అందుకోవడం, మహేశ్ బాబుకీ జాతీయంగా మంచి క్రేజ్ ఉండడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు మించే ఈ సినిమాని తెరకెక్కించేందుకు జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. నిజానికి.. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది. 

Latest Videos

click me!