ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న విడుదల కాబోతోంది. సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉండగా ఇప్పటి నుంచే అంచనాలను పెంచేందుకు దర్శక నిర్మాతలు నడుం బిగించారు.
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న విడుదల కాబోతోంది. సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉండగా ఇప్పటి నుంచే అంచనాలను పెంచేందుకు దర్శక నిర్మాతలు నడుం బిగించారు. అయితే అనుకున్న స్దాయిలో క్రేజ్ రావటం లేదు. బాలీవుడ్ స్టార్ నటి కృతి సనన్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించిన సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి నిలుస్తుందని అభిమానాలు భావించారు. ఈ భారీ సినిమా అయితే మన దేశపు చరిత్ర రామాయణం ఆధారంగా తెరకెక్కించటంతో ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అందరూ భావించారు. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ అయితే తెరకెక్కించాడు. కాగా మొదటి నుంచి కూడా చాలా అంచనాలు ఉన్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ మెటీరియల్ రిలీజైన నాటి నుంచి నమ్మకాలు తగ్గిపోతున్నాయి.
దానికి తోడు అప్డేట్స్ కూడా పెద్దగా దీనితో ఈ భారీ సినిమా నుంచి రావటం లేదు. రీసెంట్ గా ఇప్పుడు ఈరోజు శ్రీరామనవి అప్డేట్ కోసమే అంతా ఆసక్తిగా చూసారు. అయితే అనుకున్న టైం కే 7 గంటల 11 నిమిషాలకి చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ పైనా విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దాని ప్రభావం ప్రీ రిలీజ్ బిజినెస్ పై పడుతోందని చెప్తున్నారు. బడ్జెట్ కు తగినట్లు రేట్లు చెప్తూంటే ఉత్సాహంగా తీసుకుని రిలీజ్ చేసే వారు కనపడటం లేదని బాలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి.
దానికి తోడు రోజు రోజుకీ ఆదిపురుష్ పై హైప్ తగ్గిపోయినట్టుగా క్లియర్ గా కనపడుతోంది. ఇదంతా ఒకెత్తు అయితే ఆదిపురుష్ సినిమాని ఇప్పుడు ఓవర్సీస్ లో కొనేందుకు అయితే ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ముందుకు రావట్లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం సినిమాకి ఉన్న అవుట్ పుట్ మెయిన్ కారణం, అలాగే చెప్తున్న రేటు అని వినపడుతోంది.
అవుట్ ఫుట్ సరిగ్గా రాలేదని, మళ్లీ రిపీర్లు జరిపినా వారికి ఆదిపురుష్ మీద నమ్మకం లేదట. అందుకే ఆదిపురుష్ ని కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదట. కాగా దీనితో స్వయంగా నిర్మాతలే ఓవర్సీస్ మార్కెట్ లో రిలీజ్ చేయడమో లేక మళ్ళీ కొత్త టీజర్ వచ్చాక విజువల్స్ ఏమన్నా ప్రామిసింగ్ గా ఉంటే అప్పుడు డిస్ట్రిబూస్టర్ లు ముందుకొస్తారేమో అని ఎదురుచూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరో ప్రక్క ఇప్పటికే విడుదలైన ‘ఆదిపురుష్’ టీజర్ విమర్శలపాలైంది. సరికొత్త టెక్నాలజీ, భారీ గ్రాఫిక్స్‌తో రూపొందిన టీజర్‌ను బుల్లితెరపై చూసి చాలా మంది పెదవి విరిచారు. అయితే, అదే టీజర్‌ను వెండితెరపై 3డీలో చూపి వహ్వా అన్నారు. అయినప్పటికీ ఈసారి ప్రేక్షకుల మతిపోగెట్టేలా ప్రచార కార్యక్రమాలు ఉండాలని దర్శకుడు ఓం రౌత్ భావిస్తున్నారట. అందుకే, టీజర్ 2.0ను ఛాలెంజింగ్‌గా తీసుకొని సిద్ధం చేస్తున్నారట.