‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్‌తో మరో ప్రెష్ లవ్ స్టోరీ తో అదరకొట్టబోతున్నాడని చెప్తున్నారు.
నాగచైతన్య మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. వరస పెట్టి ప్రాజెక్టులు చేస్తున్నారు. ఫీల్ గుడ్ సినిమాల స్పెషలిస్ట్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేసారు. అలాగే మళ్ళీ అదే దర్శకుడితో ‘ధూత’ అనే సిరీస్ చేస్తున్నాడు. OTT ఫ్లాట్ ఫాం కోసం చైతూ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చైతు. ఆ ప్రాజెక్ట్ తర్వాత చేయబోయే సినిమాలు కూడా లాక్ చేసేసారని సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు నాగచైతన్య... నెక్స్ట్ పరశురాం తో ‘నాగేశ్వరరావు’ అనే ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ ఫన్ ఎలిమెంట్స్ ఉండే సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయింది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టబోతున్నాడు. ‘నాగేశ్వరరావు’ సినిమా తర్వాత చైతు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వెంకటేష్ తో సినిమా చేద్దామని చాలా కాలం ప్రయత్నాలు చేసి, దర్శకుడిగా గ్యాప్ తీసుకొని నటుడిగా మారారు తరుణ్ భాస్కర్. ఇప్పుడు చైతూకు ఓ చక్కటి స్టోరీ చెప్పి ఒప్పించారట.
‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్‌తో మరో ప్రెష్ లవ్ స్టోరీ తో అదరకొట్టబోతున్నాడని చెప్తున్నారు. ఇటీవల తరుణ్ చెప్పిన లైన్ చైతూకి నచ్చి, ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నారని సమాచారం. అంతా ఓకే అయితే వచ్చే ఏడాది ఈ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కుతుంది.
అయితే ఇప్పుడు నాగచైతన్య లిస్ట్ లోంచి కొందరు తప్పుకుంటన్నట్లు సమాచారం. అలా తప్పుకున్న వాళ్ళలో ‘నాంది’ దర్శకుడు విజయ్ కనక మేడల, కిషోర్ తిరుమల ఉన్నారని వినపడుతోంది. ఈ డైరక్టర్స్ తో కూడా ఇప్పట్లో సినిమా ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తుంది. మరో ప్రక్క ఈ గ్యాప్ లో రాహుల్ సంక్రిత్యన్ కి మాత్రం చైతు చాన్స్ ఇచ్చే అవకాశం ఉందని వినికిడి.