మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,.. అమెరికా, లండన్, రాయలసీమ, కోస్తా, నిజాం ఇలా యునివర్షల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు.
చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎఫ్ 3 మూవీ మొన్న శుక్రవారం గ్రాండ్‌గా విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. ఎఫ్2 సీక్వెల్‌గా తెరకెక్కిన ఎఫ్ 3 చిత్రం బిగ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందనే టాక్ విన్పిస్తోంది. అదే సమయంలో ఎఫ్ 3 సినిమా హక్కుల్ని అదిరిపోయే ధరకు సదరు ఓటీటీ వేదిక దక్కించుకుంది. ఎఫ్3 ఓటిటి రైట్స్ ని ఫ్యాన్సీ ప్రైజ్ కి సోనీ లివ్ సంస్థ దక్కించుకుంది. ఓటిటి రైట్స్ కోసం అమెజాన్ సంస్థ కూడా పోటీ పడ్డప్పటికీ సోనీ లివ్ దక్కించుకున్నట్లు టాక్. దాదాపు 18 కోట్లు ఆఫర్ చేసినట్లు చెప్తున్నారు. అది ప్రక్కన పెడితే ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం కొందరు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే కాస్త ఎక్కువ టైమ్ పట్టేటట్లు ఉందని తెలుస్తోంది.
ఎగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రం సక్సెస్ స్దాయిని బట్టి ఓటిటి రిలీజ్ డేట్ నిర్ణయం జరుగుతుందని వినికిడి. ఈ చిత్రం విడుదలైన నాలుగు వారాల తర్వాత ప్లాట్‌ఫారమ్‌పై స్ట్రీమింగ్ అవుతుందని భావించారు. అయితే ఇప్పుడు యాభై రోజులు అయ్యాకే ఈ చిత్రం ఓటిటిలో కు వస్తుందని అంటున్నారు. సోనీ LIV ఇప్పటివరకు కొనుగోలు చేసిన అతి పెద్ద తెలుగు చిత్రం ఇదే.
”ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,. యూనివర్షల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేయడం ఆనందంగా వుంది” అని పేర్కొంది ఎఫ్3 చిత్ర యూనిట్.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. ఎఫ్ 3తో మరో బిగ్గెస్ట్ సక్సెస్ ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 మాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. వెంకటేష్ గారి సీతమ్మవాటిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 తో హ్యాట్రిక్ విజయం, అలాగే వరుణ్ తేజ్ తో ఫిదా, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకం. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,.. అమెరికా, లండన్, రాయలసీమ, కోస్తా, నిజాం ఇలా యునివర్షల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడితో మా జర్నీ విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా వుంది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు.