‘భోళా శంకర్’ విడుదల తర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని అందరూ భావించారు. అందుకు కారణం ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ...
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ (Bhola Shankar)ఆగస్ట్ 11న విడుదల అయ్యి డిజాస్టర్ అయ్యింది. దాంతో మొత్తం లెక్కలే మారిపోయాయి. చిరంజీవి ఆచి,తూచి నిర్ణయాలు తీసుకోకపోతే తన కెరీర్ కు తనే కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని చిరంజీవి భావించినట్లున్నారు. దాంతో భోళాశంకర్ రిలీజ్ కు ముందు ఆయన కమిటైన రెండు చిత్రాలపై దృష్టి సారించారు. ఆ సినిమాల్లో ఒకటి కల్యాణ్ కృష్ణతో(Kalyan Krishna), రెండోది వశిష్ఠతో. అయితే మొదట కల్యాణ్‌కృష్ణ సినిమానే మొదలవుతుందని టాక్ వినిపించింది. స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైంది. బెజవాడ ప్రసన్న కుమార్ కథ ఇచ్చాడన్నారు. చాలా నెలలు పాటు కథపై కసరత్తు చేసారు. అలాగే నటీనటుల ఎంపిక చేసారు.
‘భోళా శంకర్’ విడుదల తర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని అందరూ భావించారు. అందుకు కారణం ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmitha Konidela) తన సొంత బ్యానర్‌లో నిర్మించాలనుకోవటమే. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ కాన్సిల్ అయ్యిపోయిందని తెలుస్తోంది.చిరంజీవి మొదట వశిష్టతో ముందుకు వెళ్తున్నారు. కథ తన ఇమేజ్ కు తగినట్లు లేదని వద్దన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రాజెక్టు దాదాపు లాంచ్ అవుతుంది అనుకున్న టైమ్ లో ఆగిపోవటం అంటే అప్పటికే పెట్టిన ఖర్చుకు నీళ్లు వదిలేసుకోవటమే. ఇప్పుడు అదే జరిగిందని ప్రచారం జరుగుతోంది. స్క్రిప్టు వర్క్ నిమిత్తం, ఆర్టిస్ట్ లకు అడ్వాన్స్ లు ఇచ్చినవి,దర్శకుడుకి ఇచ్చినవి అన్నీ కలిపి దాదాపు కోటి పైనే పోయిందని అంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం అయితే లేదు. కేవలం మీడియాలో వినపడుతున్న వార్తలు మాత్రమే.
వాస్తవానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినట్లు తెలిసింది. నిర్మాతగా సుస్మిత పేరు ఉన్నా.. తెర వెనుక పెట్టుబడి పెట్టి నడిపించేది అంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే చూసుకోబోతుందని చెప్పుకున్నారు. ఇరువురకి మధ్య చర్చలు జరిగాయని తెలిసింది. గుడ్ విల్ పేరిట, లాభాల్లో కొంత వాటా సుస్మితకు ఇవ్వడానికి పీపుల్ మీడియా సంస్థ సుముఖంగా ఉందని అన్నారు. ఇది మంచి డీల్ అనిపించడంతో చిరు కూడా దీనికి సై అన్నారని వినపడింది. అయితే అక్కడిదాకా వెళ్ళకుండానే ప్రాజెక్టు ఆగిందని అంటున్నారు. చూడాలి మరి చిరు క్యాంప్ నుంచి ఈ వార్తలపై స్పందిచాల్సి ఉంది.