చిరు ఓకే చేసిన నెక్ట్స్ 3 సినిమాలు..వాటి డైరక్టర్స్,షాకింగ్ లైనప్

Published : Apr 22, 2023, 09:36 AM IST
 చిరు  ఓకే చేసిన నెక్ట్స్  3 సినిమాలు..వాటి డైరక్టర్స్,షాకింగ్ లైనప్

సారాంశం

యంగ్  స్టార్ హీరోలు  సైతం సంవత్సరానికి ఒక సినిమా విడుదల చేయడానికి ఇబ్బందులు పడుతుంటే చిరంజీవి స్పీడ్ చూస్తే మాత్రం...రెండు మూడు లాగించే పనిలో ఉన్నారు.


వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత చిరంజీవి వరస పెట్టి కథలు వింటూనే ఉన్నారు. వాటిలో కొన్నింటికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుతున్న సమాచారం మేరకు ఆయన ముగ్గరు డైరక్టర్స్ కు ఓకే చెప్పి పూర్తి స్క్రిప్టు లు రెడీ చేసుకోమన్నారు. అవేమిటి అంటే...

 బింబిసార దర్శకుడు వశిష్టతో ...యువి క్రియేషన్స్ బ్యానర్ లో సోషియో ఫాంటసీ చిత్రం మొదట మొదలు కానుంది.

  బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు కుమార్తె సుశ్మిత కొణిదల నిర్మాతగా సినిమా చేయబోతున్నారు.

జవాన్ ఫేమ్ దర్శక,రచయిత బి.వియస్ రవి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా సినిమా కు ఓకే చెప్పారు.

ఈ మూడు ప్రాజెక్టులలోనూ బి.వియస్ రవి ప్రాజెక్టు పైనే సందేహాలు ఉన్నాయంటున్నారు. ఇంకా ఫైనల్ అయ్యిందా లేదా అనే క్లారిటీ లేదని చెప్తున్నారు.

ఇలా  కొన్ని ప్రాజెక్టులు లైన్ లో పెట్టిన చిరంజీవిప్రస్తుతం మెగా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "భోళా శంకర్". మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో తమిళంలో విజయవంతమైన చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

అలాగే  తాజా సమాచారం ప్రకారం చిరంజీవి మరికొందరు డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రజినీకాంత్, అమితాబచ్చన్ లాగా మెగాస్టార్ కూడా వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్  స్టార్ హీరో లు సైతం సంవత్సరానికి ఒక సినిమా విడుదల చేయడానికి ఇబ్బందులు పడుతుంటే చిరంజీవి స్పీడ్ చూస్తే మాత్రం సంవత్సరానికి రెండు మూడు సినిమాలు విడుదల చేసే లాగా కనిపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఐ బొమ్మ క్లోజ్ అవ్వడంతో సినిమా కలెక్షన్లు పెరిగాయా? స్టార్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలయ్య సినిమా కోసం బోయపాటి భారీ రెమ్యునరేషన్, అఖండ 2 కోసం ఎంత తీసుకున్నాడంటే?