#Balakrishna:‘వీరసింహారెడ్డి’కథ గురించి క్రేజీ లీక్,నిజమైతే మామూలుగా ఉండదు

By Surya Prakash  |  First Published Dec 18, 2022, 6:19 AM IST

 వీరసింహారెడ్డి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తుండటం గమనార్హం.


 సంక్రాంతి కానుకగా బాలకృష్ణ తను హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాను రిలీజ్ చేస్తున్న  సంగతి తెలిసిందే. మొదట డిసెంబర్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకున్నారు. ఎందుకంటే సంక్రాంతికు తమ బ్యానర్ నుంచే చిరంజీవి హీరోగా చేసిన మరో భారీ సినిమా వైజాగ్ వీరయ్య వస్తోంది. అయితే బాలయ్య మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని సంక్రాంతికి పండగలా ఉంటుందని  సంక్రాంతికి రిలీజ్ చేయాలని చెప్పారని  తెలుస్తోంది.  బాలయ్య కెరీర్ లో సంక్రాంతికి విడుదలైన ఎన్నో సినిమాలు అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి సైతం ఆ మ్యాజిక్ ను కచ్చితంగా రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు  బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు అయిన నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి సినిమాలను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ ఏమిటంటే...

ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్​ లో కనిపించనున్నారు! ఒకటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ క్యారెక్టర్ అయిన వీరసింహారెడ్డి , మరొకటి యుఎస్-రిటర్న్ రోల్ అయిన బాల సింహారెడ్డి.  ఈ తండ్రి,కొడుకులు చుట్టూ కథ తిరుగుతుంది.  గ్రామ రాజకీయాల్లో వీరసింహారెడ్డి పాత్ర చనిపోతే ...యుఎస్ నుంచి వచ్చిన పాత్ర ...పగ తీర్చుకుంటాడని, అలాగే వీరసింహారెడ్డి మధ్యలో ఆపేసిన కొన్ని పనులను పూర్తి చేస్తాడని చెప్తున్నారు. సాప్ట్ వేర్ నుంచి వచ్చిన వాడు ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి వస్తే లైట్ తీసుకున్న వాళ్లకు ఎలా బుద్ది చెప్పాడు అనేది మెయిన్ పాయింట్ అంటున్నారు. ఈ కాలం యూత్ కు కనెక్ట్ అయ్యేలా బాలసింహా రెడ్డి పాత్ర ఉంటుందని చెప్తున్నారు.  ఈ రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్ ఉంటుంది  చెప్తున్నారు. బోయపాటి కాంబినేషన్ లో బాలయ్యచేసిన డ్యూయిల్ రోల్ చిత్రాలన్నీ సూపర్ హిట్ కావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై ఉంది. 

Latest Videos

ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది. ఈ సినిమా రన్‌‌టైమ్‌ను 2 గంటల 43 నిమిషాలు అని తెలుస్తోంది. ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

 మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సైతం ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో ఖర్చు చేశారు. పలు ఏరియాలలో వీరసింహారెడ్డి రైట్స్ రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయి. గోపీచంద్ మలినేని ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

click me!