Kalyan Ram:'మాయా అద్దం' కళ్యాణ్ రామ్ లైఫ్ ని మారుస్తుందా? దాని మ్యాటరేంటి

By Surya Prakash  |  First Published Jun 9, 2022, 6:34 AM IST

‘ఎంత మంచివాడవురా’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాను భారీగా విడుదల చేయనున్నారు.


ఏకకాలంలో  హీరోగానూ మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నారు కళ్యాణ్ రామ్.  హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కెరీర్ లో తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటున్నారు. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు హిస్టారికల్ పిక్షన్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రానున్నారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు కథన బేస్ చేసుకుని ఓ చిత్రం చేస్తున్నారు.  

 ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు.ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా  రిలీజ్ చేసిన ‘బింబిసార’ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ ను రెండు పవర్ ఫుల్ పాత్రల్లో ప్రెజెంట్ చేశారు. అయితే ఇప్పుడు  ఆ రెండు పాత్రలకు లింక్ ఓ మాయా అద్దం అని తెలుస్తోంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.

Latest Videos

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో ఓ అద్దం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ కథలో రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉంటాయి. వీటికి అద్దానికి లింక్ ఉంటుంది. ఓ మ్యాజిక్  మిర్రర్ ద్వారా ఆ కాలం నుంచి ఈ కాలానికి, ఈ కాలం నుంచి ఆ కాలానికి వెళ్లటం జరుగుంది. అసలు ఆ మ్యాజిక్ మిర్రర్ మిస్టరీ ఏమిటి... ఇప్పటి కళ్యాణ్ రామ్ ..అప్పటి బింబసార కాలానికి వెళ్లి ఏం చేయనున్నారు అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాలి.
 
‘బింబిసార‌లో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ కీల‌కంగా ఉండ‌బోతున్నాయి. భారీ సెట్స్‌తో క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నిక‌ల్ వేల్యూస్ మూవీ ఇది. ఆగ‌స్ట్ 5న సినిమాను విడుద‌ల చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తుంది.
 

click me!