రిలీజ్ కు రెడీ అయిన విజయ్ ..లియోకు మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం గుంటూరు కారం కు లింక్ ఉంది. ఆ వార్త ఏమిటి...ఆ కనెక్షన్ ఏమిటో చూద్దాం.
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'గుంటూరు కారం'. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటూనే వస్తోంది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు సంబంధించి.. తాజాగా ఓ ఆగ్ల దినపత్రికలో వార్త ఒకటి వచ్చి షాక్ ఇచ్చింది. ఆ వార్త ప్రకారం రిలీజ్ కు రెడీ అయిన విజయ్ ..లియోకు గుంటూరు కారం కు లింక్ ఉంది. ఆ వార్త ఏమిటి...ఆ కనెక్షన్ ఏమిటో చూద్దాం.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) భారీ క్రేజ్ తో రిలీజ్ అవుతున్న లేటెస్ట్ మూవీ లియో(Leo) పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే.ప్లాఫ్ అంటూ ఎరగని స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) ఈ సినిమాను తెరకెక్కించటమే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అలాగే కమల్ హాసన్‌తో 'విక్రమ్' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం వల్ల సినిమా భారీ రేంజ్లో హైప్ ఉంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం డబ్బింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఈ సారి కాస్త ఎక్కువగా ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ వార్త పాపులర్ ఆగ్ల దినపత్రిక డెక్కెన్ క్రానికల్ లో వచ్చింది. అదేమిటంటే...గుంటూరు కారం మొదట రెడీ చేసిన స్క్రిప్టు లియోకు బాగా పోలికలు ఉన్నాయని.
అదెలా అంటే...లియో తమిళ నిర్మాత లలిత్ కుమార్...హాలీవుడ్ చిత్రం ‘A History of Violence’రైట్స్ ని బారీ రేటుకు తీసుకున్నారని..అందులోని మూలకథను తీసుకుని తమిళ సినిమాకు తగినట్లు మార్పులు చేసి లియోని తెరకెక్కిచారని చెప్తున్నారు. అయితే అదే సమయంలో గుంటూరు కారం చిత్రం కూడా ఇదే సినిమానుంచి మూల కథ తీసుకుని త్రివిక్రమ్ రెడీ చేసారని, ఈ విషయం తెలిసిన నిర్మాత లలిత్ కుమార్ తాము అఫీషియల్ గా రైట్స్ తీసుకున్నామని చెప్పి స్క్రిప్టు మార్చుకోమని కోరినట్లు చెప్తున్నారు. అప్పుడు త్రివిక్రమ్ ఆఘమేఘాల మీద పూర్తి స్దాయి స్క్రిప్టు ని మార్చి కొత్త పాయింట్ తో ,కొత్త తరహా కథనంతో మహేష్ కు సరపడా తయారు చేసారని, ఆయన దర్శక,రచయిత కాబట్టి అంత స్పీడుగా చేయగాలరని అంటున్నారు. అయితే అదీ తమకు తమిళ సోర్స్ నుంచి వచ్చిన సమాచారం తోనే కథనం రాసినట్లు చెప్తున్నారు ఆగ్ల దినపత్రికవారు. ఇందులో నిజమెంత అనేది లియో దర్శక,నిర్మాతలకు, గుంటూరు కారం దర్శక,నిర్మాతలకు తప్పించి వేరే వారికి తెలియదు. అయినా ఇప్పుడు ఈ రెండు కథలు వేర్వేరే కాబట్టి అసలు ఆలోచించక్కర్లేదు.
డేవిడ్ క్రోనెన్ బర్గ్ దర్శకత్వంలో 2005లో వచ్చిన హాలీవుడ్ సినిమా 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్' కల్ట్ క్లాసిక్ గ్యాంగ్‌స్టర్ సినిమాగా నిలిచింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే... ఈ చిత్రాన్ని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు చూసేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో జగపతి బాబు ప్రధాన పాత్రలో సీన్ టు సీన్ తీశారు. 2010లో గాయం 2 పేరుతో రిలీజైన ఈ చిత్రం ఫరవాలేదనిపించుకుంది. ఇప్పుడు అదే 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్' సినిమాలోని ఓ కోర్ పాయింట్‌ను తీసుకుని దర్శకుడు లోకేశ్ తనదైన స్టైల్లో మార్చి స్క్రిప్టు రాసుకుని డైరెక్ట్ చేశారట. ఎలాగో లోకేశ్ టాలెంట్ ఎలాంటిదో ఇప్పటికే ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలతో చూశాం. కాబట్టి లియోను కాపీలా కాకుండా అద్భుతంగా తెరకెక్కించే ఉంటారని అభిమానులు ఆశపడుతున్నారు.
'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషతో పాటు తెలుగులో 'లీడర్' సహా కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్ ప్రియా ఆనంద్ కీలక పాత్ర చేశారు. ఇంకా బాలీవుడ్ స్టార్, 'కెజియఫ్'తో విలన్ గా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న హిందీ హీరో సంజయ్ దత్ ఓ పాత్రలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్.