Krithi Shetty : శ్రీలీలా అనుకొని కృతి శెట్టిని పొగిడిన అభిమాని.. షాక్ అయిన బేబమ్మ.. వీడియో

By Nuthi Srikanth  |  First Published Jan 25, 2024, 9:54 PM IST

టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి (Krithi Shetty) ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అభిమాని మాటలకు యంగ్ బ్యూటీ ఆశ్చర్యపోయింది. 
 


టాలీవుడ్ లో ‘ఉప్పెన’ చిత్రంతో దూసుకొచ్చింది కృతి శెట్టి.  ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది.  ఇటీవలనే మరోసినిమాను కూడా ప్రకటించింది. తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. అయితే ఇక్కడ మాత్రం ఈ ముద్దుగుమ్మ పలు మాల్స్ ఓపెనింగ్ లో కనిపిస్తూ సందడి చేస్తోంది. తన అభిమానులతో ముచ్చటిస్తూ ఆకట్టుకుంటోంది. 

ఈ క్రమంలో రీసెంట్ గా ఓ మాల్ ను ప్రారంభించిన కృతిశెట్టికి అభిమాని మాటలు షాక్ ఇచ్చాయి. మాల్ లో మాట్లాడుతుండగా.. ఫ్యాన్ ఒకరు మీరు నటించిన ‘స్కంద’ చిత్రం బాగుందన్నారు. దాంతో కృతిశెట్టి షాక్ అయ్యింది. థ్యాంక్యూ అని చెబుతూనే... అందులో నేను లేను అంటూ బదులిచ్చింది. పాపం అభిమానులు బేబమ్మను మరిచిపోతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Latest Videos

ఇక ఇండస్ట్రీలో శ్రీలీలా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. వరుస చిత్రాలతో దుమ్ములేపుతోంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. లీలమ్మ దెబ్బకు బేబమ్మ క్రేజ్ తగ్గిపోయింది. ఏదేమైనా కృతిశెట్టి మాత్రం కోలీవుడ్ ప్రస్తుతం మంచి అవకాశాలు అందుకుంటోంది. 

తెలుగులో కాస్తా పట్టుకోల్పోయినా... తమిళంతో మాత్రం క్రేజీ హీరోయిన్ గా మారింది. రీసెంట్ గానే ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ తో కలిసి నటించబోతున్నట్టు ప్రకటించింది.  ప్రదీప్ రంగనాథన్ - కృతిశెట్టి కాంబోలో ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’ రూపుదిద్దుకుంటోంది. స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్జే సూర్య కృతికి తండ్రిగా నటిస్తున్నారు. ఇక కీర్తి..     Vaa Vaathiyaare, Genie, Sharwa35 వంటి చిత్రాల్లోనూ నటిస్తోంది. మలయాళంలోనూ ఓ సినిమా చేస్తోంది. 

😂😂😂 pic.twitter.com/juPnazSC3l

— T o M m Y ツ (@rakesh_tarakian)
click me!