గుర్తుందా శీతాకాలం చిత్రం ,చిరుతో చేసిన భోళా శంకర్ సినిమాలు డిజాస్టర్ అవటం కూడా ఆమెకు మార్కెట్ తగ్గిపోయాలే చేసింది.
హీరోయిన్ తమన్నా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఆమె వల్ల సూపర్ హిట్ అయ్యిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. 2005 నుంచి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. స్టార్ హీరోల్లో దాదాపు అందరినీ కవర్ చేసింది. అయితే గత కొంతకాలంగా తన తర్వాత జనరేషన్ రావటంతో స్పీడు తగ్గింది. రష్మిక, శ్రీలీల వంటివారు టాలీవుడ్ ని ఏలుతున్నారు. ఈ క్రమంలో సీనియర్ హీరోల నుంచి ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఆమె అడుగుతున్న రెమ్యునరేషన్ ఎక్కువని ఫీలై, తగ్గించుకోమని చెప్తున్నారట. ఆమె సినిమాకు మూడు కోట్లు దాకా డిమాండ్ చేస్తోందని వినికిడి. అదే స్పెషల్ సాంగ్ అయితే ఎనభై లక్షల నుంచి కోటీ దాకా అడుగుతోందిట.
సినిమాకు రెండు నుంచి రెండు యాభై లోపు అంటే యాభై లక్షలు నుంచి కోటి దాకా తగ్గించుకుంటే ఆమెతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ఉన్నారని, ఓటిటి మార్కెట్ ను బట్టి ఇలా రెమ్యునరేషన్ లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్స్ వాళ్లు ఖచ్చితంగా ఆమె రేటు తగ్గించుకుంటే సినిమా ఉంటుందని లేకపోతే కష్టమని చెప్పేసి వెళ్లిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది తమన్నాని డైలమోలో పడేస్తోందట. ఒక సారి తగ్గటం మొదలెడితే అది ఎక్కడికి వెళ్లిఆగుతుందో అని ఆచి,తూచి అడుగులు వేస్తోంది. ఎఫ్ 2 ఇంకాస్త ఆడి ఉండి బ్లాక్ బస్టర్ అయ్యి ఉంటే ఆ లెక్కే వేరేగా ఉండేది.అలాగే గుర్తుందా శీతాకాలం చిత్రం ,చిరుతో చేసిన భోళా శంకర్ సినిమాలు డిజాస్టర్ అవటం కూడా ఆమెకు మార్కెట్ తగ్గిపోయాలే చేసింది.
తెలుగులో తమన్నా నటించిన “హండ్రెడ్ పర్సెంట్ లవ్, బద్రినాథ్, ఊసరవెల్లి, రచ్చ, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఆగడు, బాహుబలి (సిరీస్)” చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. కొన్ని చిత్రాలలో అతిథి పాత్రల్లోనూ మురిపించిన తమన్నా, మరికొన్ని సినిమాల్లో ఐటమ్ గాళ్ గానూ ఊరించింది. ‘అల్లుడు శీను’లోని “లబ్బరు బొమ్మ…”, ‘స్పీడున్నోడు’లో “బ్యాచ్ లర్ బాబూ…”, ‘జాగ్వార్’లో “మందార తైలం…”, ‘జై లవకుశ’లో “స్వింగ్ జరా…”, ‘సరిలేరు నీకెవ్వరు’లో “డాంగ్ డాంగ్…” పాటల్లో తమన్నా అందచందాలు కుర్రకారుకు విడదీయరాని బంధాలు వేశాయి. వెంకటేశ్ జోడీగా ‘ఎఫ్-2, ఎఫ్-3’ చిత్రాల్లో తమన్నా కామెడీ సైతం భలేగా పండించారు. చిరంజీవి ‘సైరా…నరసింహారెడ్డి’లో లక్ష్మి పాత్రలోనూ ఎంతగానో మురిపించారామె.
ఇక తమన్నా మొదటి సినిమా టాలీవుడ్ లో చేసిన సంగతి తెలిసిందే, ఇక్కడ అగ్రనటిగా వెలుగొంది, తరువాత బాలీవుడ్ లో కూడా ఓ వెలుగు వెలుగుతోంది. అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్, వెబ్ సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగా వుంది.అలాగే ఇప్పుడు హైదరాబాదుకి చెందిన నటుడు విజయ్ వర్మ (VijayVarma) తో రిలేషన్ షిప్ లో వుంది. మొదట్లో కొన్నాళ్ళు ఇద్దరూ దాచినా, తరువాత బహిరంగంగానే తాము ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆ తరువాత వీరిద్దరూ ఎన్నో ఫంక్షన్స్ లో కలిసి కనిపించారు, చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు కూడా. ఈ రిలేషన్ షిప్ ని వివాహం వరకు తీసుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. వచ్చే సంవత్సరం ఇద్దరూ వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు ఒక వార్త నడుస్తోంది.