#PawanKalyan:‘ఉస్తాద్ భగత్ సింగ్’లో హీరోయిన్ గా ఆమె అయితే కష్టమే?

By Surya Prakash  |  First Published Dec 13, 2022, 10:08 AM IST

పవన్ సినిమా అంటే ఖచ్చితంగా ఎడ్జెస్ట్ చేసుకుని చేస్తుందనటంలో సందేహం లేదు. అయితే  పవన్ కళ్యాణ్ తన సినిమాకి ఇచ్చిన డేట్స్ ఎప్పుడైనా మార్చేసే అవకాసం ఉంది.


రీసెంట్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్‌సింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.  అలాగే ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా షూటింగ్ లో ఈరోజు పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది. రెండో రోజు కూడా ద్వితీయ విఘ్నం లేకుండా షూటింగ్ జరిగింది. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు సంబంధించిన షూటింగ్  రామానాయుడు స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్‌సింగ్ మొదటి షూటింగ్ షెడ్యూల్ 20 తేదీ దాకా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ విషయం ప్రక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారనేది అభిమానుల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.

 ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో కూడా పూజ హెగ్డే హీరోయిన్ అని రెండేళ్ల క్రితం ప్రకటించాడు డైరక్టర్ హరీష్ శంకర్. అయితే,  ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా స్థానంలో ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చింది. కథ మారింది..ఈ క్రమంలో ఏ హీరోయిన్ తో ముందుకు వెళ్తాడనే ప్రశ్న మొదలైంది. పూజనే ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటాడని అంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ పూజ హెగ్డేలది హిట్ కాంబినేషన్. 

Latest Videos

అయితే ఇక్కడో చిక్కు ఉంది పూజ తెలుగు,తమిళ,హిందీలలో వరస సినిమాలు చేస్తోంది.అయినా పవన్ సినిమా అంటే ఖచ్చితంగా ఎడ్జెస్ట్ చేసుకుని చేస్తుందనటంలో సందేహం లేదు. అయితే  పవన్ కళ్యాణ్ తన సినిమాకి ఇచ్చిన డేట్స్ ఎప్పుడైనా మార్చేసే అవకాసం ఉంది. ఆయన పొలిటికల్ షెడ్యూల్ ని బట్టి షూటింగ్ లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో  పూజ హెగ్డే లాంటి బిజీ హీరోయిన్ కు డేట్స్ ఎడ్జెస్ట్ అవుతాయా...?అనేది పెద్ద ప్రశ్న . తెలుగులో ఆమె త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన నటిస్తోంది. అదీ పెద్ద సినిమా కావటంతో ....పవన్  సినిమాకి డేట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవడం కష్టమే అంటున్నారు. ఈ క్రమంలో  హీరోయిన్ గా పూజ హెగ్డే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నట్లే చెప్పాలి. అయితే పూజ కాకపోతే సీన్ లోకి ఎవరు వస్తారు..శృతి హాసన్ ని తీసుకువచ్చి గబ్బర్ సింగ్ నాటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇక పవన్-హరీష్ కలయికలో ఇప్పటిదాకా వచ్చింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన ప్రభంజనం కారణంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా చేస్తున్నారు. దీనితోపాటు సుజిత్ దర్శకత్వంలో కూడా సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.
 

click me!