Pawan Kalyan: 'వకీల్ సాబ్' సీక్వెల్ గా ఆ మళయాళ సూపర్ హిట్ రీమేక్ ?

By Surya Prakash  |  First Published Jun 5, 2022, 3:40 PM IST

పృధ్విరాజ్ సుకుమారన్ , సురాజ్ వెంజారమూడ్ ,  ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘జనగణమన’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో, పృధ్విరాజ్ సుకుమారన్, లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. 



హిందీ పింక్ చిత్రాన్ని తెలుగు రీమేక్ "వకీల్ సాబ్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా సూపర్ హిట్ తో తక్కువ సమయంలోనే మంచి కలెక్షన్లు సాధించిన సంగతి తెలసిందే. అయితే అప్పటి కోవిడ్ పరిస్దితుల దృష్ట్యా విడుదలైన కొద్ది రోజులకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలై తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.  కరోనా కారణంగా సినిమా థియేటర్స్ లో చూడలేకపోయిన అభిమానులకు బుల్లితెరపై ఈ "వకీల్ సాబ్" ని బాగానే ఆదరించారుప. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతి హసన్ హీరోయిన్ గా నటించిగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ అందించిన సంగీతంతో ఈ సినిమాలోని పాటలు మరింత క్రేజ్ సంపాదించాయి. ఇప్పటికే వెండి తెరపై రికార్డులు సృష్టించిన "వకీల్ సాబ్" కు సీక్వెల్ ఎలా ఉంటుందనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తాజా సమాచారం.

ఆ సినిమాలోని వకీల్ సాబ్ పాత్రను కంటిన్యూ చేస్తూ మళయాళంలో వచ్చిన చిత్రం రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు.   నెం.1గా ట్రెండ్ అవుతోన్న జనగణమన. పృధ్విరాజ్ సుకుమారన్ , సురాజ్ వెంజారమూడ్ ,  ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘జనగణమన’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో, పృధ్విరాజ్ సుకుమారన్, లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శ్రీదివ్య  హీరోయిన్ గా నటించగా.. ధ్రువన్, షారీ, షమ్మీ తిలకన్, రాజా కృష్ణమూర్తి, అళగం పెరుమాళ్, పశుపతి, వినోద్ సాగర్, విన్స్ అలోషియస్, మిథున్, విజయ్ కుమార్, వైష్ణవీ వేణుగోపాల్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్ 28న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 

Latest Videos

ఇక ఈ నెల 2న ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ (Netflix) లో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకోడమే కాకుండా.. నెం. 1గా ట్రెండ్ అవుతోంది. ఇంతవరకూ నెం. 1 స్థానంలో ఉన్న ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) హిందీ వెర్షన్ ను పక్కకు నెట్టి.. సత్తా చాటుకుంది.  ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశా ఎన్ కౌంటర్ (Disha Encounter) సంఘటన ఆధారంగా వేరే నేపథ్యం, కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కాబట్టి మనవాళ్లకూ ఈ సినిమా బాగానే నచ్చే అవకాసం ఉంది.

సభా అనే ఒక కాలేజ్ లెక్చరర్‌ను నలుగురు యువకులు మానభంగం చేసి, చంపేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. నలుగురు నిందుతుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఎన్ కౌంటర్‌లో చంపేస్తారు. ‌‌ఈ ఆపరేషన్ కు నాయకత్వం వహించిన అసిస్టెంట్ కమీషనర్ సజ్జన్ కుమార్‌పై మానవహక్కుల సంఘం విచారణకు ఆదేశిస్తుంది. ‌కేస్ కోర్ట్ లోకి వస్తుంది. ఈ కేస్‌ను అరవింద్ స్వామీనాథన్ వాదిస్తాడు. ఇక్కడే సినిమా ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఇంతకీ సభా అనే లెక్చరర్ ను ఎందుకు చంపుతారు? దీని వెనుక ఎవరున్నారు? అనేది సినిమాకి కీలకం. 

అసిస్టెంట్ కమీషనర్ సజ్జన్ కుమార్ గా సురాజ్ వెంజారమూడ్, అడ్వకేట్ అరవింద స్వామీనాథన్ గా పృధ్విరాజ్ సుకుమారన్ నటించగా.. సభాగా మమతా మోహన్ దాస్ (Mamtha Mohandas) నటించారు. సాధారణ ఇన్టెస్టిగేటివ్ థ్రిల్లర్ లా అనిపించిన ఈ మూవీ.. కోర్ట్ రూమ్ లోకి అడుగుపెట్టాకా ఆకేసు మొత్తం స్వభావమే మారిపోతుంది. అదే ఈ సినిమాకి కీలకమైన పాయింట్. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో అడుగడుగునా ఉత్కంఠను రేపుతూ.. ప్రేక్షకుల్ని అబ్బుర పరుస్తాడు దర్శకుడు. మలయాళంలో రూ. 10కోట్లు బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా.. రూ. 50కోట్ల వసూళ్ళను రాబట్టడం విశేషం. దాంతో ఈ సినిమాని పవన్ తో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు వినికిడి. 
 

click me!