Naga Chaitanya:ఈ సారి 'డీజే టిల్లు' నాగ చైతన్య, స్క్రిప్టు వర్క్ స్టార్ట్

By Surya Prakash  |  First Published Jun 1, 2022, 6:17 AM IST

స‌ర‌దాగా సాగే రొమాంటిక్ కామెడీలా తెర‌కెక్కించిన డీజే టిల్లు ప్రేక్ష‌కుల‌కు ఓ రేంజిలో ఎక్కేసింది. ఈ సినిమాలో డైలాగులు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆ చిత్రం దర్శకుడు ఏ సినిమా చేస్తున్నాడనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. 


సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ కేవలం  స్టార్ హీరోల సినిమాలే కాకుండా కంటెంట్ ప్ర‌ధాన‌మైన సినిమాల‌ను రూపొందిస్తూ పెద్ద హిట్స్ కొడుతోంది.  ఈ క్ర‌మంలో ఈ సంస్థ నుంచి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌రో చిత్రం ‘డీజే టిల్లు’. ఈ చిత్రం ఊహించని విధంగా పెద్ద హిట్టైంది. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లోని డైలాగ్స్ పెద్ద కాంట్ర‌వ‌ర్సీకి దారి తీశాయి. డీజే టిల్లు చిత్రంలో అడ‌ల్ట్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండొచ్చు అనే ఊహాగానాలు కూడా బ‌లంగానే వినిపించాయి. అయితే  స‌ర‌దాగా సాగే రొమాంటిక్ కామెడీలా తెర‌కెక్కించిన డీజే టిల్లు ప్రేక్ష‌కుల‌కు ఓ రేంజిలో ఎక్కేసింది. ఈ సినిమాలో డైలాగులు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆ చిత్రం దర్శకుడు ఏ సినిమా చేస్తున్నాడనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం దర్శకుడు విమల్ ...నాగచైతన్య తో ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత డిజే టిల్లు సీక్వెల్ తీయమని వరస ఆఫర్స్ వచ్చాయి. అయినా ఆ దారిలో వెళ్లకుండా వేరే కథతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఓ కథని రెడీ చేసుకుని స్క్రిప్టు రెడీ చేసినట్లు సమాచారం. స్టోరీ లైన్ ..నాగచైతన్యకు చెప్పటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు అదే స్క్రిప్టు పై వర్క్ చేస్తున్నారు. అయితే పూర్తిగా కన్వీన్స్ అయ్యాకే నాగచైతన్య సెట్స్ మీదకు వెళ్దామని చెప్పారట. క్యారక్టరైజేషన్ బేసెడ్ గా స్టోరీ జరుగుతుందిట. ఈ కథకు, డీజే టిల్లుకు అసలు సంభందం ఉండదని చెప్తున్నారు. 

Latest Videos

ఇక నాగచైతన్య తన తదుపరి చిత్రం  'సర్కారు వారి పాట' దర్శకుడుతో చేయూబోకున్నట్లు సమాచారం. సర్కారు వారి పాట  సినిమా కంటే ముందుగానే ఈ సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్నారు కానీ మహేష్ బాబుకి పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో ముందుగా 'సర్కారు వారి పాట'ను పట్టాలెక్కించారు. ఇప్పుడు చైతు సినిమా పనిలో పడ్డారు పరశురామ్.  ఈ సినిమాకి 'నాగేశ్వరరావు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇదివరకు అనుకున్న టైటిల్ కూడా ఇదే . ఇప్పుడు దీన్నే ఫైనల్ చేశారు.

 ఇందులో చైతు మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ గా కనిపించబోతున్నారు. మిడిల్ క్లాస్ నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్న. పరశురామ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు కీలకంగా ఉంటాయి. ఇందులో కూడా హీరోయిన్ కి ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చైతు నటించిన 'థాంక్యూ' సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలలో సినిమా రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 

click me!