RRR:రాజమౌళిపై మండిపడుతున్న ఇండస్ట్రీ పెద్దలు? పెద్ద తలనొప్పే

By Surya Prakash  |  First Published Jan 3, 2022, 8:37 AM IST


  ఆలియా భట్ మరియు ఓలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డి వి వి ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.
 



కొన్ని ఊహించని సమస్యలు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసిన ప్రాజెక్టుని అయినా ఇబ్బందుల్లో పడేస్తాయి. చాలా మందికి అది కోపం తెప్పించే పని అవుతుంది. రాజమౌళి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. రాజమౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ కోసం చాలా మంది  తమ సినిమాలని  ప్రక్కకు తప్పించి దారి ఇచ్చారు. ఇప్పుడు అదే ఆర్ ఆర్ ఆర్ వాయిదా వేసారు. దాంతో నార్త్ మాట ఎలా ఉన్నా సంక్రాంతికి వద్దామనుకున్న తమిళ,తెలుగు సిని నిర్మాతలు మాత్రం మండిపడుతున్నారుట. ఎంతసేపూ రాజమౌళి తన సినిమా,లాభాలు,కలెక్షన్స్ గురించి ఆలోచిస్తున్నారే కానీ మిగతా సినిమాలు ,ఇండస్ట్రీ ఇబ్బందిపడుతుందునే ఆలోచన చేయటం లేదంటున్నారు. వివరాల్లోకి వెళితే..

 రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో  రాజమౌళి రూపొందించిన భారీ పాన్ ఇండియా చిత్రం “రౌద్రం రణం రుధిరం”.డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయటానికి ప్లాన్ చేసారు. గత కొద్ది రోజులుగా చిత్రం ప్రమోషన్స్ నిమిత్తం ఈ సినిమా నుంచి వేగంగా అప్ డేట్ లను వదులుతున్నారు. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మేకర్స్ మొత్తం 7 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇందులో ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా ఉందట.   దీనితో పాటుగా ఈ చిత్రం 3డి లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఊహించని విధంగా వాయిదా వేసారు. 

Latest Videos

  ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ నెల 7న ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. మా చిత్రాన్ని వాయిదా వేయవలసి వచ్చింది. బేషరతుగా ప్రేమిస్తున్న అభిమానులు, ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అని చిత్ర యూనిట్ తెలిపింది. వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాని మళ్లీ మీ ముందుకు తీసుకువస్తామని హామీ ఇస్తున్నామ‌ని నిర్మాణ సంస్థ డివివి ఎంట‌ర్ టైన్ మెంట్ తెలిపింది. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ ఓ ట్వీట్ ని పోస్ట్ చేశారు.  

వాస్తవానికి నార్త్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి రావడంతోనే దర్శకుడు రాజమౌళి మనసు మార్చుకోక తప్పలేదని సమాచారం. ముంబ‌యిలో డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో స‌మావేశమై వాయిదా నిర్ణ‌యం తీసుకున్నాడు రాజమౌళి. ఇప్పటికే నాలుగు సార్లు ఈ సినిమా వాయిదా పడింది. అసలు జనవరి 7కి రిలీజ్ అంటే దీనిపై పెద్ద రచ్చ జరిగింది. రాజమౌళి పై చాలా విమర్శలు వచ్చాయి.  పరిస్దితులు చక్కబడితే సమ్మర్ కే  సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏప్రిల్ మొదటి నుంచి ప్రతి వారానికీ ఓ భారీ చిత్రం రిలీజ్ ప్లానింగ్ ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ ఆ టైంలో వస్తే రెండు మూడు సినిమాలు ప్రక్కకు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం డిస్ట్రబ్ అయ్యిపోతుంది. దాంతో రాజమౌళి విషయంలో ఈ సారి సహకారం ఇండస్ట్రీ నుంచి గతంలో వచ్చిన స్దాయిలో సహకారం రాకపోవచ్చు అంటున్నారు.ఏదైమైనా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు పెద్ద తలనొప్పే.

Also Read : Pushpa OTT: 'పుష్ప' ఓటీటీ రిలీజ్​ డేట్ ఫిక్స్? ఈ వారమే

  ఆలియా భట్ మరియు ఓలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డి వి వి ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

Also Read : Akhanda:'అఖండ' కు ఆంధ్రాలో కొత్త సమస్య, చర్చల్లో నిర్మాత?
 

click me!