#Raviteja:పూరి జగన్ సమస్యే...రవితేజ ఎదుర్కోబోతున్నాడా ?

By Surya Prakash  |  First Published Sep 5, 2022, 2:23 PM IST

రవితేజతో కలిసి చేసిన సినిమాలన్నీ పూరిని స్టార్ డైరెక్టర్ గా నిలిపాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం ఐదు సినిమాలు తెరకెక్కాయి.అందులో మూడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా. రెండు సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి. ఇద్దరి కెరీర్ అద్బుతంగా సాగింది. 



రవితేజ.పూరి జగన్నాథ్.ఇద్దరు మంచి స్నేహితులు. వీళ్లిద్దరూ కష్టాల్లోకలిసి తిరిగారు. ఒకప్పుడు మద్రాసులో సినిమా అవకాశాల కోసం చెప్పులు అరిగేలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన బ్యాచుల్లో పూరి, రవి కూడా ఉన్నారు.ఈ ఇద్దరు కలిసి ఒకే రూంలో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు.  అప్పటి  నుంచి వీరి మధ్య స్నేహం కొనసాగుతుంది.ఇచ్చిన మాట ప్రకారం పూరి దర్శకుడు కాగానే రవితేజతో సినిమా చేశాడు.తన మిత్రుడి హీరోయిజాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు రవితేజ.

అంతేకాదు.రవితేజతో కలిసి చేసిన సినిమాలన్నీ పూరిని స్టార్ డైరెక్టర్ గా నిలిపాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం ఐదు సినిమాలు తెరకెక్కాయి.అందులో మూడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా. రెండు సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి. ఇద్దరి కెరీర్ అద్బుతంగా సాగింది. ఇప్పుడు ఇద్దరూ ఒకే రకమైన సమస్యలో ఒకేసారి పడ్డారని సమాచారం.

Latest Videos

పూరి జగన్నాథ్ తాజా చిత్రం లైగర్ డిజాస్టర్ అయ్యంది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిత్రం తో బాగా నష్టపోయారు. దాంతో ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్ చేసిన వారు, బయ్యర్లు ..ఈ సినిమా నిమిత్తం నష్ట పోయిన మొత్తాన్ని రికవరీ చేయమని అడుగుతున్నట్లు సమాచారం. దాంతో త్వరలో వారితో పూరి ..మీటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. 

అదే సమయంలో  మాస్‌ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. యువ దర్శకుడు శరత్‌ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో  రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటించారు. భారీ అంచనాల మధ్య జులై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్  లభించింది. అయితే ఉన్నంతలో రిలీజ్ రోజు మార్నింగ్ షోకు ఓపినింగ్స్ ఫరవాలేదనిపించాయి. కానీ మాట్నీ నుంచి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు నష్టాల్లో నిండా మునిగి పోయారు. ఇప్పుడు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రవితేజను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. వీరందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని , కలిసి  నష్టపరిహారం చెల్లించాలంటూ రవితేజపై ఒకేసారి కలవబోతున్నారని సినీ సర్కిల్‌లో టాక్‌ కూడా నడుస్తోంది. అప్పటికీ  నిర్మాత సుధాకర్ చెరుకూరి బయ్యర్లకు తన వంతు సాయం అందజేశాడు. కానీ అవేమీ వారికి ఒక మూలకు కూడా సరిపోలేదని అంటున్నారు. 

దాంతో నష్టాల్లో ఉన్న బయ్యర్లు అందరూ  మంగళ,బుధ వారాల్లో రవితేజను కలవనున్నారు. రవితేజ తన బ్యానర్ రవితేజ టీమ్ వర్క్స్‌పై ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.   ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి.  కానీ పావు వంతు కూడా రికవరీ కాలేదు.

click me!