రాధేశ్యామ్ సినిమా రిజల్ట్ తర్వాత ప్రభాస్ ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో తన దగ్గరకు వస్తున్న డైరక్టర్స్ ని కాకుండా వారి కథలను క్రాస్ చెక్ చేస్తున్నారు.
ప్రభాస్ తో సినిమా అంటే ప్రతీ దర్శకుడుకి ఆసక్తే. అయితే ప్రబాస్ ఇమేజ్ బాహుబలి తర్వాత పూర్తిగా మారిపోయింది. తన ప్యాన్ ఇండియా ఇమేజ్ కు తగినట్లు కథలు రెడీ చేసుకున్న వారితోనే ఆయన ప్రయాణం చేస్తున్నారు. అలాగే ఆయన చుట్టూ స్టార్ డైరక్టర్స్ కథలు చెప్పటానికి క్యూలు కడుతున్నారు. తమ కథలకు ప్రభాస్ పెరఫెక్ట్ అని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్టార్ డైరక్టర్ రీసెంట్ గా కలిసారని, అయితే ప్రబాస్ స్టోరీ లైన్ నో చెప్పారని వినికిడి.
రాధేశ్యామ్ సినిమా రిజల్ట్ తర్వాత ప్రభాస్ ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో తన దగ్గరకు వస్తున్న డైరక్టర్స్ ని కాకుండా వారి కథలను క్రాస్ చెక్ చేస్తున్నారు. ప్రస్తుత తన ఇమేజ్ కు తగినట్లు ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు. ఎంత మంచి కథ అయినా తన ఇమేజ్ కు తగ్గట్లు లేకపోతే కష్టమని భావిస్తున్నారు. ఇప్పుడు తను కథలకు తగ్గట్లు తగ్గి నటించలేనని చెప్పేస్తున్నారట. ఈ మేరకు తాజాగా తమిళంలో వరస హిట్స్ కొడుతున్న ఓ స్టార్ డైరక్టర్ ప్రాజెక్టుకు నో చెప్పినట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు...
లోకేష్ కనగరాజ్ .
లోకేష్ కనగరాజ్ తాజాగా కమల్ హీరోగా రూపొందిన విక్రమ్ కు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి , ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 3న విడుదలకానుంది. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. ఈ క్రమంలో డైరక్టర్ లోకేష్ కనగరాజ్ తన తర్వాత ప్రాజెక్టులు లైన్ లో పెట్టుకుంటున్నారు. విజయ్ తో ఆయన నెక్ట్స్ చిత్రం ప్లాన్ చేసారు. అలాగే ఆ తర్వాత ప్రభాస్ తో ఆయన సినిమా చేయాలని అనుకున్నారు. ఈ మేరకు ఓ స్టోరీ లైన్ ని ప్రబాస్ కు వచ్చి వినిపించారట. అయితే ప్రబాస్ ...తను బాహుబలి తర్వాత తను చేసే చిత్రాలు గురించి చెప్పి లార్జర్ దేన్ లైఫ్ పాత్రలు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలియచేసారట. డ్రామా ఉన్న కథ అయినా, యాక్షన్ తో కూడిన కథ అయినా తను బాహుబలి ముందు చేసిన చిత్రాలు తరహాలోనే ఉంటాయని ..తను ఇప్పుడు చేస్తున్న చిత్రాల తరహా ప్యాన్ ఇండియా స్టోరీ ఉంటే చెప్పమని అడిగారట.
విక్రమ్ విషయానికి వస్తే... జూన్ 3న విడుదలకానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేసింది టీమ్. మత్తుగా మత్తుగా అంటూ సాగుతోన్న ఈ పాటను చంద్రబోస్ రాయగా కమల్ పాడారు. ఒరిజనల్‌గా ఈ పాటను తమిళ్‌లో కమల్ హాసన్ రాసి..పాడారు. ఈ పాట అక్కడ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో కూడా విడుదలైన ఈ పాట సూపర్బ్ రెస్పాన్స్‌ను పొందుతోంది.
ఇక ఈ సినిమాలో కమల్‌హాసన్ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను యువ నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకుంది. అందులో భాగంగా శ్రేష్ఠ్ మూవీస్ జోరుగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తోంది.