వింటేజ్ చిరును గుర్తు చేసిన వీరయ్య గెటప్ గూస్ బంప్స్ కలిగిస్తుంది. ఈ క్రమంలో దర్శకుడు బాబీపై మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల కాంబినేషన్ లో రూపొందిన భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' . ఈ సినిమాను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేస్తున్నారు నిర్మాతలు మైత్రీ మూవీస్ వారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో రవితేజ పాత్ర ఏమై ఉంటుందనే ఊహాగానాలు అంతటా వినపడుతున్నాయి. కొందరు రవితేజ నెగిటివ్ పాత్ర అని అంటున్నారు.
అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో రవితేజ, చిరంజీవిలు ఇద్దరూ స్టెప్ బ్రదర్శ్...అంటే సవతి అన్నదమ్ములు. చిరంజీవి ఆంధ్రా నుంచి వస్తే..రవితేజ ..తెలంగాణా నుంచి వస్తాడు. అయితే రవితేజ పాత్ర చనిపోతుంది. అతన్ని చంపిన వాళ్లపై చిరంజీవి పగ తీర్చుకోవటమే మెయిన్ కథ అని తెలుస్తోంది. రవితేజ పాత్రను వెతుక్కుంటూ చిరంజీవి వస్తాడని, ఫస్టాఫ్ అంతా చిరంజీవి ఆ వెతుకలాటలో ఉంటే ఫన్ నడుస్తుంది. ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ రివీల్ అవుతుంది. రవితేజ ప్లాష్ బ్యాక్ సెకండాఫ్ లో ఉంటుందిట. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాలి.
ఇక ఈ సినిమాకు వీరయ్య టైటిల్ పెట్టడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. చిరంజీవి ఇండస్ట్రీకి రాక ముందు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న టైంలో దర్శక నిర్మాతలకు ఫోటోలు పంపేందుకు ఒక కెమెరా అవసరమయ్యింది. తండ్రి వెంకట్రావు గారితో పాటు పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొలీగ్ వీరయ్య ఈ విషయంలో సహాయం చేసి చిరంజీవిని అందంగా ఫోటోలు తీసి ఆయనే స్వయంగా మద్రాసుకు పంపేవారట. ఒక్కోసారి చిరుకి చెప్పకుండా నిర్మాణ సంస్థలకు పంపిన సందర్భాలు ఉన్నాయట.అలా వీరయ్య తీసిన ఫోటోల ఆల్బమ్ పరిశ్రమకు కొత్తగా అడుగు పెట్టిన టైంలో చిరుకి చాలా ఉపయోగపడింది.
ఒకవేళ వీరయ్య కనక లేకపోయి ఉంటే అంతబాగా తీసే కెమెరామెన్ ని వెతుక్కోవాల్సి వచ్చేది. అలా మెగాస్టార్ మనసులో ఆయన పట్ల ఆ కృతజ్ఞత అలా ఉండిపోయింది. బాబీ చెప్పిన మాస్ ఎంటర్ టైనర్ కథ వినగానే ఎలాగూ వైజాగ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి వీరయ్య పేరైతే బాగుంటుందని చెప్పారట. అలా ఫిక్స్ అయ్యింది.
ఇక ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. రవితేజ ప్రీ లుక్ పోస్టర్.. ఫస్ట్ లుక్, టీజర్ పై క్యూరియాసిటీని పెంచింది. పవర్ ఫుల్ పోలీస్-విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ పాత్రను పవర్ ప్యాక్డ్ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ , టీజర్ను విడుదల చేశారు మేకర్స్. బిల్డ్-అప్ షాట్ లు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చాయి. ఈ నేపధ్యంలో ప్రీ రిలీజ్ మీట్ ని సైతం భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నారని మీడియా వర్గాల సమాచారం.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రస్తుతం యూరప్ లో లీడ్ పెయిర్ పై పాటల చిత్రీకరణ చేసారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం యూరప్ లో చిరంజీవి, శృతి హాసన్ లపై చిత్రీకరిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.