Rajamouli:హిందీ ‘ఛత్రపతి’లో ఆ సీన్స్ తొలిగించారు,రాజమౌళి ఫీలవుతారా?

By Surya Prakash  |  First Published Jan 4, 2022, 6:51 AM IST

మాస్ యాక్షన్ హీరోగా ప్రభాస్ ను మరోమెట్టు ఎక్కించిన సినిమాగా 'ఛత్రపతి' కనిపిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కీ .. ఆయన డైలాగ్ డెలివరీకి తగిన కథాకథనాల కారణంగా .. రాజమౌళి టేకింగ్ కారణంగా ఈ సినిమా హిట్ కొట్టేసిందని చెప్పుకున్నారు.


ప్రభాస్ హీరోగా వచ్చి తెలుగులో ఘన విజయం సాధించిన  'ఛత్రపతి' చిత్రాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఈ సినిమా బాలీవుడ్‌ రీమేక్‌ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం టాకీ పార్ట్‌ పూర్తి చేసుకున్నట్లుగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో హిందీ రీమేక్ నిమిత్తం ...ఏ మార్పులు చేసారనేది హాట్ టాపిక్ గా మారింది.

ఒరిజనల్  ‘ఛత్రపతి’చిత్రంలో ఫస్టాప్ మొత్తం హై ఓల్టేజీ డ్రామాతో పరుగెడుతుంది. ఇంటర్వెల్ కూడా ఓ రేంజిలో ఉంటుంది. రోమాలు నిక్కబొడుచుకునే రీతిలో ఇంట్రవెల్ ఎమోషన్స్ ఉంటాయి. అయితే సెకండాఫ్ కు వచ్చేసరకి ఈ సినిమాలో ఆ స్పీడు ఉండదు. సినిమా పూర్తిగా సెంటిమెంట్ మోడ్ లోకి జారుకుంటుంది. తల్లి,కొడుకు, తమ్ముడు మధ్య డ్రామా నడుస్తుంది. ఛత్రపతిగా ఇంటర్వెల్ లో అయ్యాక నెక్ట్స్ లెవిల్ డ్రామా ఉండకుండా సెంటిమెంట్ వైపు డ్రైవ్ వెళ్లటం అప్పట్లో చర్చగా మారింది. సినిమా హిట్టైనా...మరో స్దాయికి ఈ సెంటిమెంట్ డ్రామా వెళ్లకుండా ఆపేసిందని మాట్లాడుకున్నారు. 

Latest Videos

ఈ విషయాలను దర్శకుడు వివి వినాయక్ గమనించారు. చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ తో చర్చించి మార్పులు చేసినట్లు సమాచారం. హిందీ వెర్షన్ లో సెంటిమెంట్ డోస్ బాగా తగ్గించారట. అందుకు తగ్గ సీన్స్ తీసేసి, యాక్షన్ సీన్స్ పెంచారని,విలన్ కు,హీరోకు మధ్య వార్ లా కథను పరుగెత్తించారని చెప్తున్నారు. ఫైనల్ వెర్షన్ ని రాజమౌళి కు చూపిస్తారని తెలుస్తోంది. చూసిన రాజమౌళి మెచ్చుకుంటారో లేక తను నమ్మి తెరకెక్కించిన సీన్స్ తీసేయటం చూసి ఫీలవుతారో తెలియాల్సి ఉంది. 

వాస్తవానికి మాస్ యాక్షన్ హీరోగా ప్రభాస్ ను మరోమెట్టు ఎక్కించిన సినిమాగా 'ఛత్రపతి' కనిపిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కీ .. ఆయన డైలాగ్ డెలివరీకి తగిన కథాకథనాల కారణంగా .. రాజమౌళి టేకింగ్ కారణంగా ఈ సినిమా హిట్ కొట్టేసిందని చెప్పుకున్నారు.

‘‘హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ‘ఛత్రపతి’ కథలో చక్కటి మార్పులు చేశారు. సినిమా బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు బెల్లంకొండ. ఆ లుక్‌ను త్వరలో విడుదల చేయనున్నాం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని చిత్ర నిర్మాత జయంతిలాల్‌ గడ తెలిపారు. ఈ సినిమాకి సంగీతం: తనిష్క్‌ బాగ్చి, ఛాయాగ్రహణం: నిజార్‌ అలీ షఫి.  వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని పెన్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది.  
Also Read :RRR Loss: `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా.. ప్రమోషన్స్ ఖర్చు బూడిదలో పోసిన పన్నీరేనా?

click me!