అనుష్క సినిమా కు ‘స్వాతిముత్యం’ దెబ్బ,కథ మార్చాల్సిందేనా?

By Surya Prakash  |  First Published Oct 9, 2022, 10:35 AM IST


ఒకే తరహా స్టోరీ లైన్ తో సినిమాలు తెరకెక్కడం కొత్త విషయం విషయం ఏమీ కాదు. అయితే గ్యాప్ ఇచ్చి మరీ ఇలాంటి కథలు తెరకెక్కుతూంటాయి. లేకపోతే ఇబ్బంది ఎదురౌతుంది.  ఇప్పుడు అలాంటి సమస్యే అనుష్క కొత్త చిత్రానికి వచ్చిందని సమాచారం.  వివరాల్లోకి వెళితే..
 



ద‌స‌రాకు వచ్చిన  గాడ్ ఫాద‌ర్, ది ఘోస్ట్ లాంటి పెద్ద సినిమాల‌కు పోటీగా బ‌రిలోకి దిగిన  చిన్న సినిమా.. స్వాతిముత్యం. అంత పెద్ద సినిమాల‌కు పోటీగా ఒక కొత్త హీరో న‌టించిన చిన్న సినిమాను రిలీజ్ చేయ‌డానికి కార‌ణం.. తమ చిత్రం మీద ఉన్న న‌మ్మ‌క‌మే అన్నాడు నిర్మాత నాగ‌వంశీ. ద‌స‌రా సీజ‌న్‌కు త‌గ్గ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ స్వాతిముత్యం అని అతను చెప్పాడు. బాలీవుడ్ హిట్ విక్కీ డోనర్ లాంటి ఫ్లేవర్ ఉన్న ఈమూవీ హిట్ టాక్ తెచ్చుకుంది కానీ కలెక్షన్స్ పరంగా బాగా స్లోగా ఉంది.

బెల్లంకొండ సురేష్ వారసుడిగా, బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడిగా స్వాతిముత్యం మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు బెల్లంకొండ గణేష్. వర్ష బొల్లెమ్మతో జోడీ కట్టి లక్ష్మణ్ కే కృష్ణ మేకింగ్ లో స్వాతిముత్యంగా మారి వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు గణేష్. స్వాతిముత్యం కథలోకి వెలితే పెళ్లీ వరకు వెళ్లిన హీరో జర్నీలో ఒకే ఒక్కట్విస్ట్, సీన్ రివర్స్ అయ్యేలా చేస్తుంది. ఒకరిని ఒకరు ఇష్టపడి ఇక ఏడడుగులు నడవబోతున్న జంట జీవితాల్లోకి మరో లేడీ అది కూడా స్పెర్మ్ డొనేషన్ తో కూడిన  ఓ ట్విస్ట్ ఇచ్చే కారణంతో వస్తే... ఆ సమస్యనుంచి పెళ్లి కొడుకు ఎలా భయటపడతాడనేదే సినిమా కథ.

Latest Videos

ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత అనుష్క  కొత్త సినిమాకి ఇబ్బందులు ఎదురవుతాయని తెలుగు చిత్ర పరిశ్రమలో టాక్. అనుష్క, నవీన్ పొలిశెట్టి సినిమా కథ కూడా ‘స్వాతిముత్యం’ తరహాలోనే ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. నవీన్ పొలిశెట్టి ...గణేష్ పాత్రను పోలిన పాత్రను పోషిస్తుండగా, అనుష్క పాత్ర దివ్య శ్రీపాద తరహాలో ఉంటుంది. రెండు సినిమాలకు దుబాయ్ కనెక్షన్ కూడా ఉందని బజ్ చెబుతోంది. ఇదే కనుక నిజమైతే అనుష్క మరియు నవీన్ పోలిశెట్టిల చిత్రం ఇప్పుడు కథలో పెద్ద మార్పులు చేయాల్సి ఉంటుంది. నాని నటించిన ‘అంటే సుందరానికి’ మరియు నాగశౌర్య నటించిన ‘కృష్ణ బృందా విహారి’ ఒకే కథతో ఉండడం ఇటీవల చూశాము. మళ్ళీ ఇప్పుడు అలాంటి సమస్యే ఎదురుకాబోతోందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మిస్టర్ శెట్టి మిస్సెస్ పొలిశెట్టి అనే టైటిల్ కూడా అనుకున్నారు. యూవీ క్రియేషన్స్ లో రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ ఆ సినిమాను డైరెక్ట్ చేయాలని ఒక ప్లాన్ అయితే సెట్టయ్యింది. 40ఏళ్ల మహిళ పాతికేళ్ల కుర్రాడితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే విషయాన్ని రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కించాలని అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ప్రభాస్ మద్దతు ఉండడం వల్లనే యూవీ క్రియేషన్స్ నవీన్ పొలిశెట్టిని సెలెక్ట్ చేసుకుంది.
 

click me!