SSMB28: సాఫ్ట్ వేర్ ఫ్రొపిషనల్ గా మ‌హేష్‌, పూజ హెగ్డే పాత్రేమిటంటే...

Published : Oct 06, 2022, 04:19 PM IST
SSMB28: సాఫ్ట్ వేర్ ఫ్రొపిషనల్ గా మ‌హేష్‌, పూజ హెగ్డే పాత్రేమిటంటే...

సారాంశం

మహేష్ నుంచి ఓ భారీ హిట్ ను ఎక్స్పెట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పుడు అదే పనిలో కష్టపడుతున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దాదాపు పుష్కర కాలం తర్వాత మహేష్  త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తోంది.

మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగతి తెలసిందే. రీసెంట్ గా ఫైట్స్, భారీ యాక్షన్ సీన్స్  తో ఓ షెడ్యూల్ కూడా అయ్యింది.  త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన ఆప్డేట్ బయిటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు...సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్నారట. పైకి సాఫ్ట్ గా కనిపిస్తూ...లోపల యాక్షన్ సిద్దమైన సెటప్ తో ఈ పాత్ర ..గమ్మత్తైన నేపధ్యంలో తెరకెక్కుతోందిట. ఈ సినిమాలో సాప్ట్ వేర్ ఆఫీస్ లో జరిగే ఫన్ అదిరిపోతుందంటున్నారు. 

అలాగని రెగ్యులర్ గా వెబ్ సీరిస్ లలో చూపిస్తున్న సాప్ట్ వేర్ సెటప్ కామెడీ ఉండదని అంటున్నారు. మహేష్..అతడు స్దాయిలో ఈ ఫన్ సాగుతుందిట. ఫస్టాఫ్ ఫన్..సెకండాఫ్ యాక్షన్ కు ఫుల్ స్కోప్ ఉన్న సబ్జెక్టు అంటున్నారు. అలాగే సాఫ్ట్ వేరే ఆఫిస్ లో మహేష్ కు టీమ్ లీడర్ గా పూజ హెగ్డే కనిపించనుందిట. వీళ్లిద్దరు మధ్య జరిగే సీన్స్ కు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటున్నారు. ఇదే షెడ్యూల్ లో పూజా కూడా పాల్గొనే అవకాసం ఉందిట.   

ఇక మహేష్ నుంచి ఓ భారీ హిట్ ను ఎక్స్పెట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పుడు అదే పనిలో కష్టపడుతున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దాదాపు పుష్కర కాలం తర్వాత మహేష్  త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తోంది.దాంతో మహేష్ అభిమానులంతా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అతడు, ఖలేజా సినిమాలకు బిన్నంగా ఈ మూవీ ఉండనుందని చెప్తున్నారు. 

అలాగే  ఈ చిత్రం బిజినెస్ గురించి రకరకాల వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం 300 కోట్లు దాకా పలుకుతుందని, డిజిటెల్ బిజినెస్ 200 కోట్లు దాకా ఉంటుందని చెప్తున్నారు.    ఈసారి ఈ కాంబో మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. వాటిని మించి సినిమా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు నిర్మాత నాగవంశీ. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉండదు కానీ స్పెషల్ పబ్ సాంగ్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు కోసం తన పంథా మార్చుకొని ఐటెం సాంగ్ పెడతారో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించనున్నారు. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్ళిసందడి బ్యూటీ  శ్రీలీల నటిస్తుందని టాక్. 

PREV
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?