సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ కు, మెగా ఫ్యాన్స్ కు మధ్య పెద్ద యుద్దాలు జరుగుతూంటాయి. సినిమా రిలీజ్ ల విషయంలోనూ ఆ పోటీ ఉంటుంది. కాని నిర్మాతలు అంటువంటి పోటీ రాకుండా జాగ్రత్త పడుతూంటారు.
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విలన్ గా దునియా విజయ్ నటిస్తున్నాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. బాలకృష్ణకి కరోనా రావడం వలన షూటింగు లేటైంది. ఇప్పుడు రిలీజ్ కు రంగం సిద్దమవుతోంది. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం డిసెంబర్ 2 న రిలీజ్ అవ్వాల్సి ఉంది.
కానీ షూటింగ్ లలో జరిగిన డిలే, పోస్ట్ ప్రొడక్షన్ పై పడటం,కొన్ని సీన్స్ రీ షూట్స్ తో ఈ సినిమా విడుదల తేదీ మార్చబోతున్నట్లు సమాచారం. దాంతో ఈ సినిమా రిలీజ్ ని సంక్రాంతికి పెడదామనేది బాలయ్య ఆలోచన. సంక్రాంతి అయితే తనకు సెంటిమెంట్ గా బాగుంటుందని అన్నారు. కానీ ఇదే నిర్మాణ సంస్ద వారు చిరంజీవితో బాబి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి క్రిస్మస్ కు అంటే డిసెంబర్ 23న ఈ సినిమా రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు బాలకృష్ణ చేసిన 'అఖండ' డిసెంబర్ నెలలో విడుదలై, సంక్రాంతికి కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే.
క్రిస్మస్ సెలవుల సీజన్ లో కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం మెండుగా ఉన్నందున అది మంచి నిర్ణయం అనే చెప్పాలి. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఫారిన్ ఫైట్ హైలైట్ కాబోతోందని సమాచారం.ఈ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఖర్చు విషయంలో మైత్రి మేకర్స్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదని సమాచారం. బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలవాలని భావిస్తున్నారట.
ఈ సినిమాలో ముఖ్యంగా ఫైట్ సీన్స్ హైలైట్ అవుతాయంటన్నారు. ఫస్టాఫ్‌లో వచ్చే ఫారిన్ ఫైట్ సినిమాకే హైలైట్ అవుతుందని, అంతేకాదు ఈ ఫైట్ సీన్ నందమూరి అభిమానులకు పిచ్చ పిచ్చగా ఎక్కేస్తుందని అంటున్నారు. అదే విధంగా సెకండాఫ్‌లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా బాలకృష్ణ గత సినిమాల్లో చూడని విధంగా ఉండబోతోందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.