రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. మెగా అభిమానులే కాకుండా యావత్ సినీ ఇండస్ట్రీ సైతం ఎదురు చూస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నక్సలైట్ సిద్ధగా కనిపించనున్నారు. సైరా నరసింహారెడ్డి తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఇది. ఇందులో చిరంజీవికి జోడిగా కాజల్ నటించగా, మరో జంటగా చరణ్ - పూజ హెగ్డే అలరించనున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. గతంలో చిరూ - మణిశర్మ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రం కథ ఫలానా పుస్తకం ఆధారంగా రెడీ అయ్యిందనే వార్త మీడియాలో ప్రచారం అవుతోంది. ఆ పుస్తకం ఏమిటి...ఎవరు రాసారు
మీడియాలో జరుగుతున్న ప్రచారం బట్టి...ఆచార్య సినిమా కథ శ్రీకాకుళం జిల్లాలో డెబ్బయ్యవ దశకం లో జరిగిన కథ అని తెలిసింది. సుబ్బారావు పాణిగ్రాహి అనే వ్యక్తి ఒకరు బొడ్డుపాడు అనే గ్రామంలో అప్పట్లో ఒక ఉద్యమం చేసారు. సుబ్బారావు అనే అతను ఒరిస్సా నుండి వచ్చి ఈ గ్రామంలో ఒక శివుడి గుడిలో పూజారిగా ఉంటూ భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాడు. అతని జీవితం కూడా ఒక పుస్తకంగా సుబ్బారావు పాణిగ్రాహి జీవితం అని అప్పట్లో వచ్చింది.
undefined
చరిత్ర పుటలలో నిలిచిన శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటంలో సుబ్బారావు పాణిగ్రాహి ఆట, పాట, మాట తూటాలై పేలాయి. కత్తిని, కలాన్ని ఏకం చేసి ఉద్యమించిన వీరుడు, ప్రజాకవి, కళాకారుడు, విప్లవ సాంస్కృతిక యోధుడు పాణిగ్రాహి. ఉద్యమం మీద నిర్బంధం ప్రయోగించినప్పుడు చంకలో జముకు వేసుకొని రాష్ట్రవ్యాప్తంగా జముకుల కథ ప్రదర్శించి ప్రజల మద్దతు కూడగట్టారు ఆయన. 1969 డిసెంబరు 22న రంగోమెటియా కొండలలో సుబ్బారావు పాణిగ్రాహిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు.
అతని ఉద్యమాన్ని ఆ తరువాత అతని తమ్ముడు హేమచంద్ర పాణిగ్రాహి చేపట్టాడు. అదే కాలంలో ఆదిభట్ల కైలాసం, వెంపటి సత్యం లాంటి నక్సలైట్స్ కూడా అదే బొడ్డుపాడు గ్రామం నుండి సుబ్బారావు కి చేదోడుగా ఉద్యమంలో నిలిచారు. వీరిద్దరూ ఉపాధ్యాయులుగా పని చేసి అక్కడ ప్రజలని చైతన్య వంతులని చేసేవాడు. ఇప్పుడు కొరటాల శివ సినిమా ఆచార్య అని పెట్టడానికి కూడా అదొక కారణం అని అనుకోవచ్చు. కొరటాల శివ ఈ సుబ్బారావు పాణిగ్రాహి జీవితం పుస్తకం ఆధారంగా ఆచార్య సినిమా చిన్న చిన్న మార్పులతో తీసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కథనంలో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియదు. అఫీషియల్ గా నిర్మాతలు ప్రకటిస్తే కానీ క్లారిటీ రాదు.
Also Read :Acharya: ఆచార్యలో చిరంజీవి పాత్ర ఇదే.. 'సిద్ధ' కోసం ఫస్ట్ ఛాయిస్ రాంచరణ్ కాదు
సాధారణంగా దర్శకుడు కొరటాల శివ తన సినిమాలు అన్ని ఒక సామజిక అంశాన్ని తీసుకొని దానికి కమర్షియల్ హంగులు పెడతాడు. ఇప్పుడు ఆచార్య సినిమా కూడా దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావడం..వాటిని పేద రైతులకు పంచిపెట్టే నేపధ్యంలో వస్తున్న కథ అని అంటున్నారు. కొరటాల శివ కమ్యూనిస్ట్ కుటుంబం నుండి వచ్చిన వాడు కావటం వల్ల అతని ఆలోచన ధోరణి కూడా అతని సినిమాల వలె భిన్నంగా ఉంటుంది అంటున్నారు. . మెసేజ్‌తో పాటు కమర్షియల్ అంశాలను మిక్స్ చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలోని 'లాహే లాహే', 'నీలాంబరి' సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 'లాహే లాహే' పాట అయితే యూట్యూబ్‌లో 60 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది.
Also Read :బండ్ల గణేష్‌కి కరోనా.. మూడోసారి వదలని మహమ్మారి