దేశవ్యాప్తంగా ఉన్న రియాలిటీ షోల్లో ఒక తెలుగు రియాలిటీ షోగా బాలయ్య షో నిలిచింది. పలువురు స్టార్ హీరోలు, యంగ్ హీరోలతో కలసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఏడు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.
అఖండ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసారు బాలకృష్ణ. మరో ప్రక్క‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ అంటూ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతంలో తెలుగులో వచ్చిన టాక్ షోలకు భిన్నంగా షోను హోస్ట్ చేస్తూ బాలయ్య ఇక్కడా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ షోలో బాలయ్య ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఎనర్జీ, టైమింగ్‌తో అదరగోడుతున్నారు. గెస్ట్‌గా ఎవరు వచ్చినా వారితో సరదా మాటలతో పాటు ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించటమే షో క్లిక్ అవ్వటానికి కారణమైంది.
‘ఆహా’ వేదికగా ప్రసారమవుతోన్న ఈ షో.. తాజాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన రేటింగ్స్‌లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీ.. టాప్ 10 రియాలిటీ షోలలో 5వ ప్లేస్ లో నిలిచి రికార్డు నెలకొల్పింది. ఈ నేపధ్యంలో ఈ షో నిమిత్తం బాలయ్య ఎంత తీసుకుంటున్నారనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది.
Thank you for the UNSTOPPABLE Response😀 features in the top 10 reality TV list on pic.twitter.com/zEr1LX3IuP
— ahavideoIN (@ahavideoIN)
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఫస్ట్ సీజన్ కు బాలయ్యకు వచ్చిన రెమ్యూనిరేషన్ జస్ట్ 25 లక్షలు మాత్రమే అంటున్నారు. ఎపిసోడ్ కు 25 లక్షలు వంతును మొత్తం సీజన్ కు రెండున్నర కోట్లు ఇచ్చారు అన్నమాట. అయితే షో ఇంత బ్లాక్ బస్టర్ అయింది కనుక రెండో సీజన్ కు ఎమౌంట్ రెట్టింపు అవుతుందని చెప్తున్నారు.
ఇక దేశవ్యాప్తంగా ఉన్న రియాలిటీ షోల్లో ఒక తెలుగు రియాలిటీ షోగా బాలయ్య షో నిలిచింది. పలువురు స్టార్ హీరోలు, యంగ్ హీరోలతో కలసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఏడు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. మరో మూడు ఎపిసోడ్లు పూర్తయితే.. అన్‌స్టాపబుల్ మొదటి సీజన్‌ను పూర్తి చేసుకుంటుందని సమాచారం. ఈలోపే 9.2 రేటింగ్ తో టాప్ 10లో నిలవడంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.