అదిరిపోస్ట్ కాస్టింగ్, ప్రీతమ్ సంగీతం, అమీర్ కమ్ బ్యాక్ హైప్, భారీ బడ్జెట్, క్లాసిక్ కంటెంట్..ఎటువంటి క్యూరియాసిటీని ఆడియన్స్ లో కలగ చేయకపోవటం విచిత్రం అంటున్నారు.రిలీజ్ కు ఇంకా కేవలం రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ఆగస్ట్ 11, 2022న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మేకర్స్ ఇప్పటికే ప్రకటన చేసారు. ఈ చిత్రం టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్. ఇంతకుముందు అమీర్‌తో కలిసి 'సీక్రెట్ సూపర్‌స్టార్' (2017) తీసిన అద్వైత్ చందన్ ఈ హిందీ వెర్షన్‌కు దర్శకత‍్వం వహించారు. ఈ సినిమా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో బ్యానర్‌లో రానుంది. ఇంతవరకూ బాగానే ఉంది. ఈ సినిమాకు ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో ఈ సినిమా గురించి క్రేజ్ రాలేదు. అది టీమ్ ని కంగారుపెడుతోంది.
ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ రిలీజైంది ,అమీర్ ఖాన్ నటనని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసారు. ధూమ్ 3, పీకే, త్రీ ఇడియట్స్ గుర్తుకు వస్తోందని అన్నారు. అలాగే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి.వాటికి సోసో రెస్పాన్స్ వచ్చింది. అదిరిపోస్ట్ కాస్టింగ్, ప్రీతమ్ సంగీతం, అమీర్ కమ్ బ్యాక్ హైప్, భారీ బడ్జెట్, క్లాసిక్ కంటెంట్..ఎటువంటి క్యూరియాసిటీని ఆడియన్స్ లో కలగ చేయకపోవటం విచిత్రం అంటున్నారు.రిలీజ్ కు ఇంకా కేవలం రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. దాంతో ఇప్పుడు అమీర్ ఖాన్ ..మార్కెట్ లో బజ్ కోసం కొత్త ట్రైలర్ వదువుదామా అని ఆలోచన చేస్తున్నారట. ట్రైలర్ ఫెయిల్ అవటం ఆయన అసలు ఊహించలేదట.
మారుతున్న జనరేషన్ జనాలని తను రీచ్ కాలేదనే భావిస్తున్నారని బాలీవుడ్ మీడియా అంటోంది. రిలీజైన ట్రైలర్ కు పెద్దగా రెస్పాన్స్ రాకపోవటంతో ..ట్రేడ్ కూడా ఈ సినిమా ఓపినింగ్స్ తక్కువ ఉంటాయని భావిస్తోంది. దాంతో బాలీవుడ్ ఈ పెద్ద సినిమా తేడా కొడితే ఇబ్బంది అని ఎలాగైనా హిట్ కావాలని, తిరిగి ఇండస్ట్రీ ట్రాక్ లోకి రావాలని కోరుకుంటున్నారు.
విన్‌స్టన్ గ్రూమ్ 1986 నవల ఆధారంగా 'ఫారెస్ట్ గంప్' ని తెరకెక్కించారు. 'లాల్ సింగ్ చద్దా' సినిమాకు ఎరిక్ రోత్, రచయిత అతుల్ కులకర్ణి స్క్రీన్‌ప్లే అందించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య, మోనా సింగ్ తదితరులు కూడా నటించారు. ‘ఎక్స్‌పీరియన్స్‌ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఏ సింపుల్‌మేన్’ అంటూ ‘లాల్ సింగ్ చద్దా’కు పెట్టిన ట్యాగ్ లైన్ ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే పోస్టర్లు, పాటలతో సినిమా ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ ఉత్కంఠంగా సాగుతున్న టీ20 ఫైనల్ మ్యాచ్‌లో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించింది. అనంతరం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
ఈ సినిమాలో అభిమానులకు కోరుకున్నట్లు అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ హిందీతోపాటు దక్షిణాది భాషల్లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.